గుండెపోటు వస్తే ఎలా ఉంటుందో చెప్తున్న హార్ట్ పేషెంట్. ఆ సమయంలో..?
ఏదేని ఒక పరిహృదయ ధమనిలో అవరోధం కలిగిన కారణంగా హృదయ కండరం మృతి చెందడాన్నే గుండెపోటుగా భావిస్తారు. పరిహృదయ ధమనిలో బృహద్ధమని కఠినమైన ప్లాక్ ప్రాంతంలో రక్తం గడ్డ కట్టినప్పుడు గుండెపోటు వస్తుంది. గడ్డకట్టిన రక్తం ధమనిని నిరోధించడంతో పాటు రక్త ప్రసరణను నిలిపివేస్తుంది. సంబంధిత ధమని ద్వారా సరఫరా పొందుతున్న హృదయ కండరం వెంటనే ఆమ్లజని కోసం అల్లలాడుతుంది, అంతేకాక కొద్ది గంటల్లో రక్త ప్రసరణ పునరుద్ధరింపబడని పక్షంలో, హృదయ కండరం మరణిస్తుంది. అయితే డేవ్ పార్క్ అనే వ్యక్తి క్వోరా వినియోగదారుడు.
ఇతనికి 5 ఏండ్ల కిందట గుండెపోటు వచ్చింది. అప్పుడే ఇతను అనుభవించిన విషయాలను ఇలా పంచుకున్నారు. 2017 లో నేను పెరట్లో కోత కోస్తున్నాను. పనిప్రారంభించిన కేవలం ఐదు నిమిషాల్లోనే నేను విపరీతంగా అలసిపోయాను. ఊపిరిపీల్చుకోవడం కష్టంగా మారింది. చెమటలు ఎక్కువగా పడుతున్నారు. దాంతో నేను వెంటనే కోయడం మానేశాను. నేను ఇలా అయిపోతున్నానేంటి అని ఆలోచిస్తున్నారు. కొద్ది సేపటికి మళ్లీ నేను కోతను ప్రారంభించాను. మరు నిమిషంలోనే నా పరిస్థితి దారుణంగా మారింది. నాకు చెమట పట్టడం ఎక్కువైంది. శ్వాస ఆడటం లేదు. నా ఛాతిపై పెద్ద బండరాయి పడ్డట్టు అనిపించింది.
ఛాతిలో ఏదో పడ్డ నొప్పి. ఇది ఏమాత్రం తగ్గడం లేదు. ఎంతసేపైనా అలాగే ఉంది. నా వీపు మధ్యలో భయంకరమైన నొప్పి వచ్చింది. ఆ నొప్పి నా చేతుల వెనుక భాగాలకు పాకింది. ఈ నొప్పి కుడి చేయి కంటే ఎడమ చేతికే ఎక్కువ వచ్చిందని పార్క్ చెప్పారు. ఆ తర్వాత అతను కుప్పకూలాడు. ఆ తర్వాత అతను తనను ఎమర్జెన్సీ కు తీసుకెళ్లమని తన భార్యను కోరాడు. అయితే ఇతను 45 నిమిషాల తర్వాత ఈ నొప్పి నుంచి బయటపడ్డాడు. అలాగే అతను హాస్పటల్ లో చేరాడు. ‘ఈ సమయంలో నా రక్తపోటు 185/125, HR 160+ నుంచి నా బీపీ 150/110, HR 120+కి పడిపోయింది. వారు కార్డియాక్ ట్రోపోనిన్ స్థాయిలు పెరుగున్నాయని వెల్లడించారు. అంటే ఇది గుండెపోటును సూచిస్తుంది. అందుకే నా నా హృదయ స్పందన రేటును, రక్త పోటును తగ్గించాలనుకున్నారు.
ఇందుకోసం మందులను, నైట్రోగ్లిజరిన్ IV ని ప్రారంభించారని ఆయన చెప్పారు. వాసోడైలేటర్ కారణంగా అతనికి రెండున్నర రోజులు తలనొప్పి వచ్చిందని పార్క్ చెప్పారు. అప్పుడు సెలవు దినం కావడంతో తనను ఐసియుకు తరలించారు. తన రక్తపోటును తక్కువగా ఉంచే మందులను వారు కనుగొన్నారు. కానీ చాలా తక్కువగా కాదు. బీపీని మరీ తక్కువగా చేస్తే అవయవ నష్టం జరుగుతుందని అతను చెప్పాడు. నైట్రోగ్లిజరిన్ ఒక వాసోడైలేటర్. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. అలాగే బీపీని తగ్గిస్తుందని పార్క్ చెప్పాడు. నాకు టీ తాగే అలవాటు లేదు కాబట్టి రెండు రోజులు వచ్చింది. అయితే క్రమం తప్పకుండా కాఫీ తాగే అలవాటున్న వాళ్లకి పరిస్థితి దారునంగా ఉంటుందని పార్క్ అన్నారు.
గుండెపోటు లక్షణాలు పురుషులు, మహిళల్లో మారుతూ ఉంటాయి. గుండెపోటుతో సంబంధం ఉన్న లక్షణాలు పురుషులు, మహిళలకు మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో ఛాతీ నొప్పి వంటి క్లాసిక్ లక్షణాలు కనిపిస్తాయి. మహిళలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వెన్నునొప్పి, అజీర్ణం వంటి అసాధారణ లక్షణాలను అనుభవిస్తారు. కొన్నిసార్లు మహిళలలకు ఛాతీ నొప్పి కలగకపోవచ్చు. దీంతో వారికి గుండెపోటు వచ్చినా పట్టించుకోరు. అసలు గుండెపోటే నని వారికి తెలియదు. పురుషులు, మహిళల్లో కనిపించే గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు.. ఛాతీ నొప్పి, ఛాతీలో అసౌకర్యం, వికారం, దవడలో బిగుతు, ఛాతీలో మండుతున్న భావన, మైకము, వాంతులు, అలసట, చెమట.