Life Style

హెర్బల్ టీ తాగితే మీకున్న శారీరక సమస్యలు వెంటనే తగ్గిపోతాయి.

వేడి వేడి టీ ఇచ్చే మజానే వేరు. కొంత మందికి టీ ఒక వ్యసనంలా మారిపోతుంది. అతి సర్వత్ర వర్జయేత్ అన్నది టీ విషయంలో కూడా కరక్టే. అయితే ఈ రోజుల్లో ఒత్తిడి అనేది చాలా మందిని వేధిస్తోంది. ఆఫీసుల్లో పని ఒత్తిడి, ఇంట్లో ఫ్యామిలీ ఒత్తిడి.. ఇలా అన్ని రకాలుగా ప్రెషర్ కు గురవుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు, పద్ధతులు, సూచనలు పాటించడం ద్వారా ఒత్తిడి సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా రెగ్యులర్ డైట్‌లో కొన్ని హెర్బల్, ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన టీ లను చేర్చుకోవడం వల్ల మానసిక స్థితిలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. హెర్బల్ ఆయుర్వేద టీ, ఆయుర్వేద హెర్బల్ డికాక్షన్స్ ఆందోళన నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. కొన్ని సంవత్సరాలుగా సాధారణ ప్రజల్లో ఆందోళన, ఒత్తిడి, ఇతర మానసిక ప్రవర్తనా సమస్యల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సమస్య తీవ్రంగా మారడం ప్రారంభిస్తే, మానసిక వైద్యులను సంప్రదించడం లేదా చికిత్స చేయడం తప్పనిసరి అవుతోంది.

అయితే సమస్యను అంతటి వరకు తీసుకురాకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ఉపయోగించే అనేక రకాల మూలికలు సమస్య ప్రభావాన్ని తగ్గించడంలో, మానసిక వ్యాధులు, రుగ్మతలు తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అశ్వగంధ.. ఆయుర్వేద ఔషధం అశ్వగంధ అనేక రకాల శారీరక సమస్యలను తగ్గిస్తుంది. అంతే కాకుండా మానసిక ఆందోళన, నిరాశ, నిద్ర సమస్యలను నివారిస్తుంది. 2019 లో జరిగిన అధ్యయనంలో ఒత్తిడి లేదా ఆందోళనతో ఉండే వారు పాల్గన్నారు. 8 వారాల పాటు ఈ పరిశోధన జరిగింది.

వీరిని మూడు సమూహాలుగా వర్గీకరించారు. రెండు గ్రూపులకు రోజూ 250, 600 mg అశ్వగంధ సారం ఇచ్చారు. మూడో గ్రూపుకు ప్లేసిబో (ఔషధం) మోతాదు ఇచ్చారు. అయితే.. అశ్వగంధను తీసుకునే పాల్గొనే వారిలో ప్లేసిబో తీసుకునే సమూహం కంటే తక్కువ మొత్తంలో “కార్టిసోల్” ఉన్నట్లు పరిశోధన ఫలితాలు వెల్లడించాయి. అదే సమయంలో వారిలో నిద్ర నాణ్యత కూడా మెరుగుపడిందని గుర్తించారు. చామంతి.. ఈ రోజుల్లో దేశ విదేశాల్లో చామంతి టీ ట్రెండ్ బాగా పెరిగిపోతోంది. ఇది ఒక పువ్వు నుంచి తయారు చేస్తారు. ఇందులో అనేక ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి.

2013 లో జరిపిన ఒక అధ్యయనంలో ఎనిమిది వారాల పాటు చమోమిలే హెర్బ్ తీసుకోవడం వల్ల వివిధ రకాల ఆందోళన లక్షణాలను తగ్గించవచ్చని కనుగొన్నారు. అయితే చామంతి వల్ల కొందరికి అలర్జీ కూడా వస్తుంది. కాబట్టి వారికి చామంతి వినియోగం పట్ల ప్రత్యక దృష్టి సారించాలి. లెమన్ టీ.. లెమన్ టీని స్ట్రెస్ బర్నర్ అని కూడా అంటారు. 2004లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌లో మానసిక ఒత్తిడితో బాధపడుతున్న కొంతమంది పాల్గొన్నారు. వారికి 600 mg లెమన్ టీని క్రమం తప్పకుండా అందిచారు. ఈ పరిశోధన ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker