బట్టతల పై ఈ ఆయిల్ రాస్తే మళ్ళీ జుట్టు వచ్చే అవకాశం ఉంది.
చాలా మంది బట్టతల సమస్యతో బాధపడుతుంటారు. అంతేకాకుండా వయసుతో తారతమ్యం లేకుండా చాలా మందిలో ఎక్కువగా జుట్టు రాలిపోవడం వల్ల బట్టతల వస్తుందేమోననే ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. అయితే అతి చిన్న వయసులోనే బట్టతల రావటం, జుట్టు ఊడిపోవడం, జుట్టు పలస పడటం జరుగుతుంది. జుట్టు పెరగటం కోసం చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్, షాంపూసు ఉపయోగిస్తున్నారు.. కానీ వాటిలో అనేక రకాల కెమికల్స్ ఉండటం వల్ల.. వీటివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.
దానితోపాటు సమస్యకి పరిష్కారం దొరకడం లేదు.. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి జుట్టు రాలిపోకుండా ఉండటానికి ఆయుర్వేదంలో ఒక చిట్కా ఉంది.. అవే మెంతులతో తయారు చేసిన ఆయిల్. ముందుగా మెంతులను తీసుకొని బాగా ఎండబెట్టి మెత్తగా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.. ఈ పొడి పౌడర్ లాగా చాలా స్మూత్ గా ఉండాలి.. ఒకవేళ గరుకుగా అనిపిస్తే మరొకసారి జిల్లెడు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా వచ్చిన పొడిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దాంట్లో మూడు చెంచాల మెంతి పొడిని సరిపడా కొబ్బరినూనె వేసుకొని వీటితోపాటు మూడు చెంచాల ఆముదం కూడా వేసుకొని ఈ మూడింటిని బాగా కలుపుకొవాలి.. గోరువెచ్చని మంటపై బాయిలర్ పద్ధతిలో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మరిగించాలి.. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా గాలి సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను వాడటం వలన జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది.
ఈ ఆయిల్ తో బట్టతల మాయం. ఈ నూనెను వారంలో మూడుసార్లు అప్లై చేసుకోవాలి.. తలస్నానం చేయాలని అనుకున్నప్పుడ రాత్రిపూట ఈ నూనెను మళ్లీ మరిగించి తలకి ఐదు నిమిషంలో మసాజ్ చేసుకొని పడుకోవాలి.. తెల్లవారి లేవగానే తలస్నానం చేయవచ్చు. ఇలా ఈ నేచురల్ పద్ధతిలో తయారు చేసిన వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. అంతేకాకుండా ఇది మంచి రిజల్ట్ ని కూడా ఇస్తుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు.