News

నువ్వే కావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా మరిపోయిందో చుడండి.

2000 అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది. నువ్వే కావాలి సినిమాలో తరుణ్ సరసన రిచా కథానాయికగా నటించింది. ఈ మూవీ తర్వాత తెలుగు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది రిచా. అయితే ఈ సినిమా మంచి హిట్ అవడంతో ఈ సినిమా కోసం పనిచేసిన దర్శక నిర్మాతలు హీరో హీరోయిన్లు సంగీత దర్శకులు ఇతర నటీనటులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.

ఈ సినిమా అనంతరం హీరో తరుణ్ వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇక హీరోయిన్ రీచా కూడా పలు సినిమాలలో నటించిన ఈమె పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఇలా ఇండస్ట్రీలో అవకాశాలు క్రమక్రమంగా తగ్గడంతో ఈమె 2011వ సంవత్సరంలో హిమాన్షు బజాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని విదేశాలలో స్థిరపడ్డారు.

ఇలా వివాహం చేసుకొని పూర్తిగా కుటుంబ బాధ్యతలను చేపట్టిన రీచా 2016 వ సంవత్సరంలో ఆది పినిశెట్టితో కలిసి మలుపు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనంతరం ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే రిచా ప్రస్తుతం తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నారని ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నారని తెలుస్తోంది.

ఇలా ఒక వైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు తన భర్త వ్యాపారాలలో చేదోడు వాదోడుగా కూడా ఉంటున్నారు.ఇక ఈమె సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker