News

టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో దొంగతనం, పనిమనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు..!

అందం, అభినయంతో ఆకట్టుకున్న అతుల్య రవికి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. మీటర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో తెలుగులో మరో ఆఫర్ అందుకోలేదు. ప్రస్తుతం అతుల్య రవి తన తల్లి విజయలక్ష్మితో కలిసి కోయంబత్తూరులోని వాడవల్లి మారుతం రోడ్డులో నివసిస్తుంది. తాజాగా ఈ హీరోయి ఇంట్లో చోరీ జరిగినట్లు సమాచారం. అయితే ప్రముఖ కోలీవుడ్, టాలీవుడ్ నటి అతుల్య రవి ఇంట్లో చోరీ జరిగింది. కోయంబత్తూరులోని వాడవల్లి ప్రాంతంలో ఈ ఘటన చోటచేసుకుంది. నటి తన తల్లితో కలిసి ఇదే ఇంట్లో ఉంటుంది.

ఆమె ఇంట్లో నుండి డబ్బు.. పాస్ పోర్టు కనిపించకుండా పోయాయి. ఈ విషయాన్ని గమనించిన తల్లి విజయలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో రూ. 2 వేలతో పాటు.. పాస్ పోర్టు మాయమైనట్లు ఫిర్యాదు చేసింది. కాగా, ఆమె పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. తొండముత్తూరు సమీపంలోని కులత్తుపాళ్యంలో నివాసముంటున్న అతుల్య రవి పనిమనిషి సెల్విని పోలీసులు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. దొంగతనంపై ఆరా తీయగా.. తొలుత తనకేమీ తెలియదని బుకాయించగా.. తమదైన స్టైల్లో విచారించే సరికి తానే.. తన స్నేహితురాలితో కలిసి ఈ దొంగతనం చేసినట్లు వెల్లడించింది.

తన స్నేహితురాలు సుబాషిణితో కలిసి డబ్బు దోచుకున్నట్లు ఆమె అంగీకరించింది. నిందితుల నుండి రూ.1500 స్వాధీనం చేసుకున్నారు. అయితే పాస్‌పోర్టు గురించి వివరాలు ఆరా తీస్తున్నారు. సెల్వి, సుభాషిణీని అరెస్టు చేసి మరింత విచారణ జరుపుతున్నారు. అతుల్య రవి అసలు పేరు దివ్య. 2017లో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అతుల్య. కాదల్ కాన్ కట్టుదే ఆమెకు తొలి సినిమా. కథా నాయగన్, యమాలితో మొదలైన ఆమె ప్రయాణం తెలుగు ఇండస్ట్రీకి పాకింది.

గత ఏడాది టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన మీటర్ మూవీలో హీరోయిన్ అతుల్యానే. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులున్నాయని తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker