News

దేవుడికి తలనీలాలు సమర్పించి, నాలుకపై శూలం గుచ్చుకున్న హీరోయిన్‌, ఎవరో గుర్తు పట్టరా..?

స్కూల్ అండ్ ఇంటర్, డిగ్రీలో అప్పుడే అడుగుపెట్టిన స్టూడెంట్స్ ప్రేమలో పడే కథలతో లవ్ స్టోరీస్‌ సినిమాలు తెరకెక్కేవి. టీనేజ్ అమ్మాయి, అమ్మాయి ప్రేమలో పడి.. తమ లవ్ సక్సెస్ అయ్యేందుకు తల్లిదండ్రులతో పోరాటమే చేస్తుంటారు. కాదంటే ఇంట్లో నుండి వెళ్లిపోవడం.. చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకోవడం, రౌడీలతో ఛేజింగ్.. అబ్బో ఎన్నో మలుపులు ఉంటాయి.

చిత్రం, నువ్వు నేను, జయం, గంగోత్రి, జూనియర్స్, నోట్ బుక్, ప్రేమిస్తే.. ఇటీవల బేబి మూవీ వరకు ఇలాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ ఆకట్టుకున్నాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి 10th క్లాస్. అయితే 10th క్లాస్‌ హీరోయిన్ శరణ్య.. తాజాగా ఆమె తమిళనాడు లోని ప్రముక దేవాలయం తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంది. స్వామివారికి తలనీలాలు సమర్పించింది.

అంతేగాకుండా నాలుకపై శూలం పొడిపించుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది శరణ్య. దీంతో అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సాధారణంగా అమ్మాయిలకు జుట్టు అంటే చాలా ఇష్టం. ఎంత పొడవుగా పెంచుకుంటే అంత అందంగా కనిపిస్తామన్నది వారి భావన.

అందుకే మొక్కులు చెల్లించేటప్పుడు కూడా చాలామంది అమ్మాయిలు జస్ట్ మూడు కత్తెర్లు ఇస్తారు. కానీ శరణ్య మాత్రం తన కేశాలను పూర్తిగా స్వామివారికి మొక్కుగా చెల్లించింది. దీంతో అభిమానులు, నెటిజన్లు శరణ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 10th క్లాస్ మూవీలో హీరోయిన్ గా నటించిన శరణ్య అంతకు ముందు నీ మనసు నాకు తెలుసు సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా కనిపించింది. అలాగే ప్రేమ ఒక మైకం, దూసుకెళ్తా తదితర చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించింది. అయితే తమిళంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker