ఈ లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలు, ఆర్థిక సమస్యలన్ని తొలిగిపోతాయి.

మాతా లక్ష్మి అనుగ్రహంతో ఇల్లు మరియు వ్యాపార ఖజానా నిండుగా ఉంటుంది. లక్ష్మీ దేవిని సంపదల దేవత అని కూడా అంటారు, కాబట్టి లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోవడమే కాకుండా సంపద కూడా వస్తుంది. అయితే అందరు జీవితంలో ఎదగాలని కోరుకుంటారు. సంపదలు సంపాదించాలని ఆశిస్తారు. అందుకు అనుగుణంగా కష్టపడతారు. దీంతో డబ్బు సంపాదించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటారు.
కానీ వారి ఆశలు మాత్రం తీరవు. ఈ నేపథ్యంలో ఇంట్లో సంపదలు పెరగాలంటే ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతుంటారు. తమను దేవుడు అనుగ్రహించడం లేదని చెబుతుంటారు. దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తుంటారు. మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తారు.

పగలు రాత్రి కష్టపడి పనిచేస్తుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలని కోరుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి చిత్ర పటం ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవాలి. లక్ష్మీ దేవి చిత్ర పటం తామర పుష్పం మీద కూర్చున్నట్లుగా ఉంటే మనకు మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. అలాంటి పటం ఉండేలా చర్యలు తీసుకోవడం మంచిది. ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నిలబడి ఉండే చిత్రపటం ఎప్పుడు ఉంచుకోకూడదు.

లక్ష్మీదేవి ఎప్పుడు కూర్చుండే ఉండాలి. కానీ నిలబడి ఉంటే మనకు అరిష్టమే. లక్ష్మీదేవి కూర్చుని ఉండే విగ్రహం కాని చిత్రపటం ఉంచుకోవడం వల్ల సంపదలు పెరుగుతాయి. ఇందులో ఏనుగుతో కలిసి ఉన్న లక్ష్మీదేవి పటం ఉంటే శుభం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయి. ఏనుగు బొమ్మతో ఉన్న లక్ష్మీదేవిని గజలక్ష్మి అంటారు. ఇలాంటి చిత్రపటం ఉంచుకోవడం వల్ల సంపదకు తలుపులు తెరిచినట్లే.

లక్ష్మీదేవి చిత్రపటం విషయంలో జాగ్రత్తలు తీసుకుని వాస్తు నియమాల ప్రకారం చిత్రపటం ఉంచుకుంటే మనకు ఆర్థిక కష్టాలు దూరమవుతాయి. ఈ పరిహారం అందరు పాటించి తమ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాల్సిన అవసరం ఎంతో ఉంది.