Health

తేనె ని వీటిలో కలిపి తీసుకుంటే విషంతో సమానం. అలా ఎప్పుడు చెయ్యొద్దు.

తేనెలో కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, క్లోరిన్, ఫాస్ఫరస్, సల్ఫర్, అయొడిన్, లవణాలు బాగా ఉంటాయి. కొన్ని రకాల తేనెలలో చివరికి రేడియం కూడా వుంటుంది. తేనెలో మాంగనీసు, అల్యూమినియం, బోరాన్, క్రోమియం, రాగి, లిథియం, నికెల్, సీసం, తగరం, టైటానియం, జింక్, ఆస్మియం లవణాలు కూడా ఉంటాయని నిరూపితమైంది. అయితే తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదంలో దీని పాత్ర ప్రధానమైనదే. ఎన్నో రోగాలకు ఇది మందుగా పనిచేస్తుంది. అయితే ప్రతి పదార్థాన్ని తీసుకునే పద్ధతిలో తినాలి.

తేనెను సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే చాలు. ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. గది ఉష్ణోగ్రత వద్దే దాన్ని తినాలి. అప్పుడే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చాలా మంది వేడి నీళ్లలో, వేడి పానీయాల్లో కలుపుకుని తాగుతూ ఉంటారు. వీటివల్ల ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువ. ప్రాచీన కాలం నుండి తేనె భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది. ఉదయం పూట గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగేవారు ఎంతో మంది. అలా తాగడం వల్ల బరువు తగ్గుతారని, శరీరం డిటాక్సిపికేషన్ అవుతుందని అంటారు.

కానీ వేడి నీటిలో తేనె వేయడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు అధికంగా నిండి ఉంటాయి.దీన్ని వేడి నీటిలో కలపడం వల్ల దాని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. ఆయుర్వేదం ప్రకారం, తేనెను వేడి నీటిలో కలపడం వల్ల అమా వంటి విషపదార్ధాలను విడుదల అవ్వచ్చు. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణ, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. తేనెను సాంప్రదాయకంగా వంటలో వాడతారు. ముఖ్యంగా పాశ్చాత్య వంటల్లో దీన్ని భారీగా వాడతారు.

అయితే వేడి పాన్ కేక్‌పై తేనెను వేయడం, వేడి వంటలపై తేనెను చల్లడం వంటివి చేస్తుంటారు. అధిక ఉష్ణోగ్రత వద్ద తేనే విషపూరితం అవుతుంది. హైడ్రాక్సీమీథైల్ఫర్‌ఫ్యూరల్ లేదా హెచ్‌ఎమ్‌ఎఫ్ అని పిలిచే టాక్సిన్ ‌విడుదల అవుతుంది. ఇది క్యాన్సర్ కారకంగా మారుతుంది. అధికబరువు తగ్గాలని అనుకునేవారు తేనేను తాగడం మంచిదే. చక్కెరకు బదులు తేనెను వాడడం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. అయితే టీ వేడిగా ఉన్నప్పుడు తేనెను కలపకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్లలోనే తేనె కలుపుకుని తాగాలి. పండ్ల సలాడ్లు, గోరువెచ్చగా ఉన్న అట్లు, గోరువెచ్చని నీళ్లు… ఇలాంటి వాటిలోనే తేనె కలుపుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker