ప్రజలను వణికిస్తున్న కొత్తరకం జ్వరం, ఇలాంటివారికే ప్రమాదం ఎక్కువ.
హైదరాబాద్‌కు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ ఈ మేరకు సెరోలాజిక్ టెస్టులు నిర్వహించింది. టెస్టుల్లో భాగంగా 250 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో ఐదుగురు మాంసం విక్రేతలకు క్యూ జ్వరం వున్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే కరోనా మహమ్మారి ఇంకా పూర్తి తొలగిపోనేలేదు. అంతలోనే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా క్యూ ఫివర్ వణికిస్తోంది. హైదరాబాద్ మహా నగరంలో అనేక క్యూ ఫీవర్ కేసులు బయటపడ్డాయి.
హైదరాబాద్ నగరంలో క్యూ జ్వరాలు విజృంభిస్తున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కబేళాలకు దూరంగా ఉండాలని అధికారులు హైదరాబాద్ నగర ప్రజలను కోరినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్, ఎన్‌ఆర్‌సిఎం సెరోలాజికల్ ఈ మేరకు పలు టెస్టులు నిర్వహించింది. 250 శాంపిల్స్‌లో ఐదుగురు మాంసం విక్రేతలకు క్యూ జ్వరం ఉన్నట్లు నిర్ధారించింది.
Psittacosis, హెపటైటిస్ E వంటి అనేక ఇతర జూనోటిక్ వ్యాధులు కూడా 5% కంటే తక్కువ నమూనాలలో గుర్తించినట్టుగా NRCM ధృవీకరించింది. sittacosis అనేది ఒక అంటు వ్యాధి. ఇది సాధారణంగా పక్షి జాతికి చెందినది. వ్యాధి సోకిన పక్షుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. ఈ మేరకు కబేళాలకు దూరంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వ్యాధి సోకిన వ్యక్తులు మరింత అధునాతన రోగనిర్ధారణ టెస్టులు చేయించుకోవాలని కోరారు.
Q జ్వరం అనేది మేకలు, గొర్రెలు, పశువుల వంటి జంతువుల నుండి వ్యాపించే కోక్సియెల్లా బర్నెటి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే బాక్టీరియా సంక్రమణం. వ్యాధి సోకిన జంతువు ద్వారా కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా ప్రజలు వ్యాధి బారిన పడవచ్చు. CDC ప్రకారం, Q జ్వరం ఉన్న వ్యక్తులు సాధారణంగా జ్వరం, చలి, అలసట, కండరాల నొప్పితో సహా ఫ్లూ లాంటి లక్షణాలను కలిగి ఉంటారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు అతి కొద్దిమందికి మాత్రమే ఈ వ్యాధి సోకింది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పశువుల కాపారులు పశువులు,గొర్రెలతో ఎక్కువ సమయం ఉంటారు. కాబట్టి, వారు ఆ గాలిని పీల్చినప్పుడు అటువంటి ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వీరి నుంచి ఇతరులకు వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. పరిశుభ్రత పాటిస్తూ, మాస్క్‌లు వాడటం తప్పనిసరిగా పాటించాలన్నారు.