ఐస్ క్యూబ్స్ ఇలా వాడితే మీ అందం రెట్టింపు అవుతుంది.
రోజంతా బయట వాతావరణంలో తిరగడం మరియు పని చేయడం వల్ల శరీరం మరియు చర్మం అలసిపోతుంది. చర్మం అలసటను తొలగించడానికి ఐస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది మరియు ముఖంపై ఐస్ తో రుద్దడం వల్ల మెరుస్తుంది. అయితే ఐస్ క్యూబ్స్ కేవలం డ్రింక్స్‌కు మాత్రమే ఉపయోకరం అనుకుంటే పొరపాటే.
అవి సౌందర్య పోషణకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా మంచి చర్మం అందంగా కనిపించేందుకు రకరకాల బ్యూటీ ప్రొడెక్ట్స్ వాడడం మామూలే. అయితే తరచూ దూర ప్రయాణాలు చేస్తున్న ముఖం అలసటగా ఉంటుంది. తాజాగా అనిపించాలి అంటే ఐస్ క్యుబ్ తో ముఖంపై రుద్దుకుంటే అలసట పోతుంది. ముఖంపై మొటిమల వల్ల నొప్పితో చిరాకు పెడుతుంది.
అప్పుడు ఒక మెత్తని గుడ్డలో ఐస్ ముక్కల్ని ఉంచి నొప్పి పెడుతున్న భాగంలో అద్దాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి. ఐస్ ముక్కాలా తో ఫేషియల్ చేసినట్టు మొహం పైన రుద్దితే మొహం ఫ్రెష్ గా వుంటుంది. బరువు ఎక్కువగా ఉన్న, చర్మం సాగినట్టుగా ఉన్న ప్రాంతాల్లో ఐస్‌ను ఉంచి మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్లిపోయతాయి.
చర్మం బిగుతుగా మారుతుంది. కొందరికి కళ్ళ కింద నిద్ర ఎక్కువ అయిపోయినా కళ్ళు ఉబ్బిపోయి ముడతలు కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో ఐస్ ముక్కలతో కాపడం పెడితే రక్తప్రసరణ సక్రమంగా అంది చర్మం నిగారింపుతో చెక్కగా ఉంటుంది. ఐబ్రోస్ చేయించుకుంటే ఆ ప్రాంతంలో నొప్పి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఐబ్రోస్ చేయించుకునే ముందర కనుబొమ్మలు ఐస్ ముక్కతో రుద్దితే నొప్పి అనిపించదు.