ఈ గింజలను ఇలా చేసి తింటే ఏ రోగాలు మిమ్మల్ని ఏం చేయలేవు.
పండ్లల్లో పనస పండ్లు ఒకటి. పనస పండును జాక్ ఫ్రూట్ అంటారు. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండు తొనల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. దీంతోపాటు పనస వల్ల మనసిక ఉల్లాసం కలుగుతుంది. అలసట తగ్గతుంది. చర్మ సౌందర్యంతోపాటు ఆరోగ్యవంతంగా ఉండేలా పనస సహకరిస్తుంది. అయితే పనస పండు చక్కగా పండిన తర్వాత తొనలను తిని వాటిలోని గింజలు పారేస్తుంటాం.. ఈ పనస పండు గింజలతో కొంతమంది జ్యూస్ చేసుకొని కూడా తాగుతారు.. అలాగే పనసపొట్టు కూరను కూడా భోజనాల్లో ఫంక్షన్ లో ప్రత్యేకంగా చేస్తుంటారు.
ఇలా పనసపండు గురించి తెలుసు కానీ ఆ పనస పండు గింజల గురించి ఎవ్వరికీ ఎక్కువగా తెలియదు.. ముఖ్యంగా పాతవారికైతే బాగా తెలుస్తుంది.. ఎప్పుడు పనస పండు తినేసి గింజలను తీసి పారేస్తాం కానీ.. అలాంటి గింజల్లో పండ్లు కంటే ఎక్కువ బలం ఉంటుందని.. అనేక ఔషధ గుణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఈ గింజల్లో క్యాన్సర్ లాంటి దీర్ఘ రోగాలు బారిన పడకుండా కాపాడుకోవడానికి.. మానవ కణజాలం ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా రక్షించుకోవడానికి.. ఈ గింజల్లోని కెమికల్ కాంపోజిషన్స్ బాగా ఉపయోగపడతాయని..
2012 వ సంవత్సరంలో డాక్టర్ బాల సాహెబ సవంత్ కృషి విద్యాపీట్- మహారాష్ట్ర వారు పరిశోధన చేసి ఇచ్చారు. ఈ పనస గింజల్లో బ్రౌన్ కలర్ తొక్క ఉంటుంది కదా.. అందులో ఉండే కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల మన ప్రేగుల్లో హాని కలిగించే సూక్ష్మజీవులు.. ముఖ్యంగా ఈ కోలి లాంటి 40 రకాలు ఉంటాయి.. అలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను నిర్మూలించే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఈ పనస గింజ పైన ఉంటాయని సైంటిఫిక్ గా నిరూపించారు. లూస్ మోషన్స్ ను అరికట్టే పిండి పదార్థాలు ఈ గింజల్లో ఎక్కువగా ఉంటాయని.. ఈ సమస్యను త్వరగా అధిగమించని కూడా ప్రూఫ్ చేశారు.
మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పుడల్లా పనస గింజలను ఇంటికి తీసుకొచ్చుకొని చక్కగా మైక్రోఓవెన్ లో గాని నాన్ స్టిక్ మీద కానీ దోరగా వేయించుకొని పైన తొక్క కొంచెం మాడే వరకు ఉంచుకొని తీసేస్తే ఆ గింజల్లో ఉండే పిండి పదార్థం తినటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది.. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది.. ఈ పనస గింజలతో బిరియాని కూడా చేసుకోవచ్చు.. పనస గింజల మసాలా కూర కూడా చేసుకోవచ్చు ఇలా ఎన్నో రకాలైన వంటకాలుగా కూడా వాడవచ్చు.