News

రాజమౌళితో సినిమాకి మహేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్‌లో రాబోయే ఓ చిత్రంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అదే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా. దీనిని అనౌన్స్‌ చేసినప్పటి నుంచే జనాల్లో అంచనాలు పెరిగాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఎలా ఉండబోతుంది? ఏ జోనర్‌లో ఉంటుంది?

అని తెలుసుకునేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. నేపథ్యంలో మహేశ్ బాబు సినిమాపై రాజమౌళి స్పందించారు. మరొకవైపు మహేష్ బాబు తన అందం, నటనతో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న ఈయన ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతూ ఉండడంతో ప్రకటన వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా గురించే హాట్ టాపిక్. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇకపోతే సినిమాలలో నటించినందుకు యాక్టర్లకు రెమ్యునరేషన్ ఇవ్వడం మనకు తెలిసిందే. కానీ కొంతమంది అలా కాకుండా వచ్చిన కలెక్షన్ ల వాటాల వైపు మొగ్గు చూపుతుంటారు. ఇప్పటికే చాలామంది ఆ విధానాన్ని ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ బాబు కూడా ఈ ట్రెండ్ ను ఫాలో కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇదే విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి మూవీ ప్రొడక్షన్ హౌస్ ముందు ఉంచాడట మహేష్ బాబు.

ఓటీటీ, వీఎఫ్ఎక్స్ సెటప్ ల ద్వారా పెద్ద హాలీవుడ్ ఆధారిత ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్టు కోసం ఆన్ బోర్డులోకి రావడానికి ఆసక్తి చూపించనుంది. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి తన ప్రొడక్షన్ హౌస్ పేరు ఓపెన్ చేయడంతో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోని ఈ సినిమాకు వచ్చే లాభాల వాటాలను బట్టి మహేష్ బాబు రెమ్యునరేషన్ తీసుకుంటారట. మరి ఈ డీల్ కుదురుతుందో లేదో చూడాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker