News

సిరిసంపదలను ప్రసాదించే కామధేనువు, కామధేను విగ్రహం ఆ దిశలో పెట్టాలంటే..?

ఇంట్లో లేదా కార్యాలయంలో కోరికలు తీర్చే విశ్వ గోవు అయిన కామధేను విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. హిందూమతంలో గోమాతను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. గోమాతలో సకల దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు. గోమాతను పూజిస్తే సకల దోషాలు పరిహారం అవుతాయని విశ్వసిస్తారు. ఇక అటువంటి గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సుఖ శాంతులు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే ఇంట్లో సంతోషం, శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇది మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీని, సిరిసంపదలను ఆకర్షిస్తుంది.

దీంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయి, డబ్బుకు ఎలాంటి ఇబ్బందులు రావు. వాస్తు సూత్రాల ప్రకారం.. కామధేనువు ప్రతిమను ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, దీన్ని ఇంట్లో ఏ ప్రదేశాల్లో పెట్టాలో తెలుసుకోండి. సంపద ఆకర్షణ.. కామధేనువును సంపదకు, ధనవృద్ధికి ప్రతీకగా భావిస్తారు. ఇంటి ఆగ్నేయ మూలలో ఈ ఆవు విగ్రహాన్ని ఉంచితే సంపద పెరుగుతుంది, అప్పులు తగ్గుతాయి. ఇది వ్యాపారాలు, పెట్టుబడులు విజయవంతం కావడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆరోగ్యం, మనశ్శాంతి..కామధేనువు ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పెంచుతుందని నమ్ముతారు.

ఇంటి తూర్పు దిక్కులో దీని విగ్రహాన్ని ఉంచితే ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి తగ్గుతుంది. సామరస్య వాతావరణం..కామధేనువు హార్మోని, బ్యాలెన్స్‌కి కూడా ప్రతీక. ఇది ప్రతికూల శక్తులను తగ్గిస్తుంది. గదిలో లేదా ప్రవేశ ద్వారం వద్ద దీనిని ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య శాంతి నెలకొంటుంది. ఇది మనోవేదనను తగ్గించి అందరి మధ్య మంచి అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. అదృష్టం, శుభం.. కామధేనువు అదృష్టం, శుభం తెస్తుంది. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర లేదా వాయువ్య మూలలో ఈ విగ్రహాన్ని పెడితే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. చేసిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆధ్యాత్మిక వృద్ధి, రక్షణ..కామధేనువు స్పిరిచువల్ ప్రొటెక్షన్ అందిస్తుంది.

ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. ధ్యానం చేసే ప్రదేశం లేదా ప్రార్థన చేసే ప్రదేశం దగ్గర దీనిని ఉంచితే ఆధ్యాత్మికంగా వృద్ధి సాధించవచ్చు. ఎక్కడ పెట్టాలి? దైవానుగ్రహం కోసం ఈ మూల..ఈశాన్య మూలను దైవిక స్థలంగా భావిస్తారు. ఈ మూలలో కామధేనువు విగ్రహాన్ని ఉంచితే ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు ఉంటే.. ఈ దిశ..ఆగ్నేయ మూలను ఆర్థిక వృద్ధికి సంబంధించిన దిక్కుగా భావిస్తారు.

ఈ మూలలో గోవు విగ్రహాన్ని ఉంచితే సంపద పెరుగుతుంది. అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మికత కోసం..పూజ గది లేదా ధ్యానం చేసే ప్రదేశంలో ఈ గోవు విగ్రహాన్ని పెడితే ఆధ్యాత్మికంగా ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అనారోగ్యాలు ఉంటే తూర్పు దిక్కును ఆరోగ్యానికి సంబంధించిన దిక్కుగా భావిస్తారు. ఈ దిక్కులో కామధేనువు విగ్రహాన్ని ఉంచితే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. అనారోగ్యాలు నయమవుతాయి. నెగిటివ్ ఎనర్జీకి చెక్..ప్రవేశ ద్వారం దగ్గర కామధేనువు విగ్రహాన్ని ఉంచడం ద్వారా నెగిటివ్ ఎనర్జీలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker