కాంతార క్లైమాక్స్‌లో పునీత్ రాజ్ కుమార్ ఉంటె ఎలా ఉంటుందో చుడండి.
కాంతార మూవీ క్లైమాక్స్ లో పునీత్ కనిపిస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచన చాలామంది అభిమానులకు ఉంది.అయితే పునీత్ రాజ్ కుమార్ అభిమాని ఒకరు కాంతార మూవీ పోస్టర్లను ఎడిటింగ్ చేసి రిషబ్ శెట్టికి బదులుగా పునీత్ కనిపించేలా చేశారు.
అయితే కాంతార శిడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత పునీత్ అభిమానులు.. సినిమా విడుదలైన తర్వాత, అభిమానులు పునీత్ సప్తమి గౌడ మరియు రిషబ్ శెట్టిలతో ఉన్న ఫోటోను ఎడిట్ చేసి వైరల్ చేసారు. ఓ అభిమాని ఊహించిన చిత్రం అంతకుముందు వైరల్‌గా మారింది. కాంతార గెటప్‌లో పునీత్ రాజ్‌కుమార్ డిజిటల్ ఆర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోను పునీత్ రాజ్‌కుమార్ అభిమాని షేర్ చేశారు.
ఇందులో పునీత్‌ను కాంతార సినిమాలోని శివుడిగా చూసి నెటిజన్లు ఎంతో మెచ్చుకున్నారు. తాజాగా పునీత్ అభిమానులు మరో ఫోటోను షేర్ చేశారు. కాంతార క్లైమాక్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి నటనకు ప్రశంసల వర్షం కురిసింది. అయితే అదే లుక్’లో ఇప్పుడు పునీత్‌ను పెట్టి ఎడిట్ చేసి మరో ఫోటోను వదిలారు ఫ్యాన్స్.
ఎడిట్ చేసిన ఫోటోలో పునీత్ రాజ్ కుమార్ లుక్ డిఫరెంట్ గా ఉండడంతో అభిమానులు షేర్ చేస్తున్నారు. కాంతారావు క్లైమాక్స్ సన్నివేశంలో రిషబ్ శెట్టి తో పాటు పునీత్ ఊహాత్మక చిత్రాన్ని చూపిస్తూ ఎడిట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పునీత్ రాజ్ కుమార్‌ను చాలా మిస్ అవుతున్నానమి ఆయన అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.