ఈ కాయ ఒక్కటి తింటే చాలు మీ శరీరానికి అవసరమైన వ్యాది నిరోధకశక్తి వస్తుంది.
కరక్కాయలు విలువైన జౌషధ గుణాలను కలిగివుంటాయి. వీటిలో యంత్రాక్వినోన్లు, టానిన్లు, ఛెబ్యులిక్ ఆమ్లం, రెసిన్, స్థిర తైలం మొదలనవి ఉంటాయి. అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు, అస్తమా, దగ్గు, వాంతులు, కంటి వ్యాధులు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. దగ్గు నివారణకు కరక్కాయ వాడటం ప్రముఖ గృహ వైద్యం. ఆయుర్వేద వైద్యంలో దీన్ని విరివిగా వాడతారు. అయితే ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహార పలవాట్లు జీవన శైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
అయితే ఇలా అరోగ్య సమస్యలు తలెత్తటానికి ముఖ్య కారణం శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం. మన శరీరంలో రోగ నిరోధక శక్తి సమృద్ధిగా లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అందువల్ల పౌష్టికాహారాలు తింటూ మన శరీరానికి అవసరమైన వ్యాది నిరోధకశక్తి పెంచుకోవాలి. అయితే ముఖ్యంగా కరోనా సమయం నుండి చాలామంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటున్నారు.
అయితే ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పండ్లు కూరగాయలు ఆకుకూరలలో మన శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కరక్కాయ లో కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగివున్నాయి. ఈ కరక్కాయ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా.
ముఖ్యంగా అధిక దగ్గు సమస్యతో బాధ పడేవారు ఈ కరక్కాయ తినటం వల్ల వారి సమస్య దూరమవుతుంది. అంతే కాకుండా కరక్కాయ తినటం వల్ల మన శరీరానికి అవసరమైన వ్యాది నిరోధకశక్తి సంవృద్దిగా లభించి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో కరక్కాయ పొడిని మజ్జిగలో కానీ కలుపుకొని తాగటం వల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ బ్యాటరీ దరిచేరకుండా ఉంటాయి.
గ్యాస్ అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు కరక్కాయ పొడిని ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకొని తాగడం వల్ల అందులో ఉండే టానిన్స్, ఫాలిఫెనల్ మీ సమస్యలను తగ్గిస్తుంది. కరక్కాయ పొడిని మజ్జిగలో కలుపుకుని తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కూడా కరిగిస్తుంది. అంతే కాకుండ ఈ కరక్కాయ పొడి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అలాగే యాంటీ వైరల్ లా కూడా పనిచేసి అనారోగ్యం సమస్యలను దరి చేరకుండా కాపాడుతుంది.