ఈ కషాయం తాగితే గ్యాస్, అజీర్ణం సమస్యలు వెంటనే తగ్గుతాయి.
ధనియాలు ప్రకృతిలో విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ విత్తనాలను పచ్చిగా ఉపయోగించవచ్చు లేదా పౌడర్‌గా కూడా ఉపయోగించవచ్చు. కొత్తిమీర విత్తనం లేదా దాని నుండి తయారైన పౌడర్‌ను దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో వంటలలో ఉపయోగిస్తారు. అయితే గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయి.
ప్రస్తుత జీవనవిధానం వల్ల, ఆహార అలవాట్లు వల్ల వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఎసిడిటీ మరియు గ్యాస్ ట్రబుల్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మసాలాలు అధికంగా ఉండే జంక్ పుడ్ ఆహారాన్ని తీసుకోవడం ఈ పరిస్ధితి ముఖ్యకారణమని నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం వంటి వల్ల కూడా ఇలాంటి సమస్యలు చుట్టూ ముడుతాయి.
లివర్ లో ఊత్పత్తి అయ్యో లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య, గొంతులో మంట వంటివి ఉత్పన్నం అవుతాయి. గ్యాస్ , కడుపులో మంట వంటి సమస్యలను పోగొట్టేందుకు దనియాల కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం 100 గ్రాముల ధనియాలు తీసుకుని అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ గిన్నెను పొయ్యి పైన పెట్టి బాగా మరిగించాలి. గ్లాసు నీరు వచ్చే వరకు మరిగించిన తరువాత దానిలో కొంచెం నల్లమిరియాల పొడి, జీలకర్ర పొడి చల్లుకోవాలి.
ఈ కషాయాన్ని పరగడుపునే సేవిస్తే గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ కషాయం తాగటం వల్ల గ్యాస్ మరియు ఎసిడిటి సమస్యను తగ్గటంతోపాటు రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించవచ్చు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం,విరోచనాలు వంటి వాటితో బాధపడేవారు ఈ కషాయాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది.