తీహార్ జైలులో కళ్లు తిరిగి పడిపోయిన కల్వకుంట్ల కవిత. ప్రస్తుతం ఎలా ఉందంటే..?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు అనారోగ్యం బారిన పడ్డారు. తీహార్ జైలులో ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో న్యూఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. తీహార్ జైలులో కవిత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వైద్యం అందించేందుకు జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. పూర్తీ వివరాలోకి వెళ్తే
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితకు ఆరోగ్యం బాగోకపోవడంతో వెంటనే ఆమెను దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. కవిత సుమారు నాలుగు నెలల నుంచి తీహార్ జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత నిందితురాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్ఖతకు గురయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న కవిత గత వంద రోజులకుపైగా తీహార్ జైలులో ఖైదీగా ఉన్నారు.
అయితే మంగళవారం ఆమె స్వల్ప అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆమెను దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు జైల్ అధికారులు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో ఖైదీగా ఉన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఇప్పటికే పలుమార్లు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులను ఆశ్రయించారు. అయితే బెయిల్ రాకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు లాయర్లు ప్రయత్నించారు.దానిపై కూడా కవితకు బెయిల్ మంజూరు చేయలేదు కోర్టు.