KCR: కేసీఆర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసిన యశోద వైద్యులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా..!

KCR: కేసీఆర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసిన యశోద వైద్యులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా..!
KCR: కేసీఆర్ అనారోగ్యానికి గురికావడం.. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతోపాటు ఆయనకు అందిస్తున్న చికిత్సకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌కు మెరుగైన చికిత్స అందించాలని ఈ సందర్భంగా వైద్యులు, ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

అయితే హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు చికిత్స కొనసాగుతుంది. KCR ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ నీరసంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం KCR ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ప్రకటించారు.
Also Read: నాగార్జున మొదటి భార్య లక్ష్మి,రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తీ గురించి ఎవరికీ తెలియని నిజాలు.
ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ గురువారం అనారోగ్యంతో యశోదా ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల నుంచి కాస్త నీరసంగా ఉండటంతో గురువారం సాయంత్రం సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో చేరారు.
Also Read: వెంటిలేటర్‌పై తెలుగు కామెడీ విలన్ ఫిష్ వెంకట్, సాయం కోసం వేడుకుంటున్న భార్య.
ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ షుగర్ లెవెల్స్ కాస్త పెరగగా, సోడియం లెవెల్స్ కాస్త తగ్గాయి. ప్రస్తుతం కేసీఆర్ కు షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నామని యశోద వైద్యులు వెల్లడించారు.