మీలో ఈ మార్పులు కనిపిస్తే మీ కిడ్నీలు రిస్క్‌లో ఉన్నట్టే..!
మూత్రపిండాలు దెబ్బ తిన్నాయని లాస్ట్ స్టేజ్ వరకు గుర్తించకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందువల్లనే కిడ్నీల ఆరోగ్య పరిస్థితిని మొదటే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే కిడ్నీ సమస్య వచ్చే ముందు తరచూ అలసిపోతారు. దేనిపైనా ఏకాగ్రత చూపలేరు. వారి రక్తంలో విష వ్యర్థాలు చేరతాయి. అందువల్ల నీరసం వచ్చేస్తుంది. రక్తహీనత సమస్య కూడా వస్తుంది.
సో.. అతిగా అలసిపోయేవారు డాక్టర్‌ని కలవడం మేలు. మూత్రపిండాలు సరిగా ఫిల్టర్ చెయ్యకపోతే… నిద్రసరిగా పట్టదు. మూత్రం నుంచి పోవాల్సిన విష వ్యర్థాలు రక్తంలోనే ఉండిపోతాయి. ఫలితంగా నిద్రపట్టదు. బరువు పెరుగుతారు. మాటిమాటికీ నిద్రలేస్తారు. ఈ లక్షణం కనిపించేవారు డాక్టర్‌ని సంప్రదించాలి. చర్మం పొడిబారినా, దురదలు వస్తున్నా.. అది కూడా కిడ్నీ సమస్య కావచ్చు. కిడ్నీలు రక్తకణాలకు సాయం చేస్తాయి.
ఎముకల్ని బలంగా ఉంచుతాయి. శరీరంలో ఖనిజాలు సరైన మోతాదులో ఉండేలా చేస్తాయి. ఖనిజాల విషయంలో తేడా వస్తే.. చర్మం పొడిబారి, దురదలు వస్తాయి. అది కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల కావచ్చు. కిడ్నీలు సరిగా పనిచేయని వారు తరచూ ఉచ్ఛ కు వెళ్తారు. ముఖ్యంగా రాత్రివేళ తరచూ వెళ్తారు. కొన్న సందర్భాల్లో ఇది కిడ్నీలతో సంబంధం లేకుండా ఇతర కారణాల వల్ల కూడా జరుగుతుంది.
యూరిన్‌లో అతిగా బుడగలు వస్తున్నా.. అది కూడా కిడ్నీల పనితీరులో తేడాను సూచిస్తుంది. ఈ బుడగల్ని ఫ్లష్ చేయడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. బుడగలు రావడానికి కారణం యూరిన్‌లో ప్రోటీన్ ఉండటమే. యూరిన్‌లో అతిగా ప్రోటీన్ పోతున్నప్పుడు.. అది శరీరంలో కావాల్సినంత ఉండదు. అప్పుడు కళ్ల చుట్టూ స్కిన్ ఉబ్బుతుంది. అది కూడా కిడ్నీలు దెబ్బతింటున్నాయి అనేందుకు సంకేతం కావచ్చు. ఆకలి తగ్గుతుంది.
సాధారణంగా ఆకలి చాలా సందర్భాల్లో తగ్గుతుంది. అందువల్ల ఆకలి తగ్గిపోగానే.. కిడ్నీలు పనిచేయట్లేదని అనేసుకోవద్దు. కండరాల్లో తరచూ తిమ్మిరి వస్తూ ఉంటే.. అది కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం వల్ల కావచ్చు. కిడ్నీలు పనిచేయకపోతే.. శరీరంలో ఎలక్ట్రొలైట్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. అంతే.. కాల్షియం లెవెల్స్ తగ్గడం, ఫాస్ఫరస్ సరిగా కంట్రోల్‌లో లేకపోవడం వంటివి జరుగుతాయి. అప్పుడు తిమ్మిరి వస్తుంది.