Health

ఈ కిడ్నీ సమస్యలు వారసత్వంగా వస్తాయా..? అసలు విషయం తెలిస్తే..?

కిడ్నీ సమస్యలు చాలా ప్రమాదం. మనిషి ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే కిడ్నీలను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. మధుమేహం.. అదధిక రక్తపోటు.. మధ్యపానం.. గుండె జబ్బులు.. హైపటైటీస్ సి.. హెచ్ఐవి వంటి మూత్రపిండాల వ్యాధులకు ప్రధాన కారకాలు. కిడ్నీ చెడిపోయినప్పుడు.. సరిగ్గా పనిచేయకపోవడానికి కరాణం రక్తంలో వ్యర్థాలు పేరుకుపోవడమే. అయితే కొన్నేళ్లుగా పాలీసిస్టిక్ కిడ్నీ వ్యాధి కేసులు పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు.

వయసుతో సంబంధం లేకుండా వచ్చే వ్యాధి ఇది. ఈ వ్యాధిలో మూత్రపిండంలో తిత్తులు ఏర్పడటం ప్రారంభిస్తాయి. దీనిలో ద్రవం కూడా నిండి ఉంటుంది. కొన్నిసార్లు పొక్కులు కూడా వస్తాయి. ఇలా జరిగితే కిడ్నీ పని చేసే సామర్థ్యం దెబ్బతింటుంది. ఈ వ్యాధి రావడానికి నిర్దిష్ట కారణాలేమీ ఉండవట. ఇది జన్యుపరమైన వ్యాధి, ఇది ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది.

PKD సోకిన వ్యక్తులు కూడా కాలేయం, ప్యాంక్రియాస్‌తో సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఈ వైద్య నిపుణులు అంటున్నారు. రక్తపోటు ఉన్నవారికి పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇంకా ఈ వ్యాధి లక్షణాలు ఆలస్యంగా బయటపడతాయి.. 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో సమస్యలు పెరుగుతాయి. ఆ సమయంలో పీకేడీ లక్షణాలు కనిపిస్తాయి. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ లక్షణాలు..

తరచుగా మూత్ర విసర్జన, పొత్తికడుపు పెరగడం, మూత్రంలో రక్తం, నిరంతర వెన్నునొప్పి.. ఈ లక్షణాలు కనిపించినప్పుడు అశ్రద్ధ చేయకుండా పరీక్షించుకుని చికిత్స మొదలుపెడితే క్షేమంగా ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చు. ఎప్పుడైతే వ్యాధి ముదురుతుంది అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే కచ్చితంగా అది వారి తర్వాత తరం వారికి వస్తుందని గమనించగలరు. కాబట్టి వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. రోగి అశ్రద్ద చేస్తే దాని పరిణామం కొన్ని ఏళ్ల తర్వాత ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker