మీ శరీరంలో ఈ మూడు లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీ కిడ్నీ ప్రమాదంలో ఉన్నట్లే..?

మూత్రపిండాలు మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. రక్తం నుండి వ్యర్థాలు, టాక్సిన్‌లను ఫిల్టర్ చేయడం, లోపలి శరీరాన్ని పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచడం వీటి విధి. అయితే, అనారోగ్యపు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా మూత్రపిండాలపై పనిభారం పెరుగుతుంది, దీంతో అవి నిరంతరం ఒత్తిడికి గురవుతాయి. ఇది వివిధ కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. ఇప్పటికే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న వారికి డయాలసిస్ చేయవలసిన అవసరం ఉంటుంది.
జీవించడానికి కిడ్నీ మార్పిడి కూడా అవసరం కావచ్చు. పరిస్థితి చేయి దాటక ముందే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం మేలు. అయితే ‘కిడ్నీ’ మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది శరీరం నుండి విషపూరిత టాక్సిన్స్ తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజంతా మనం తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలు, అనారోగ్యకరమైన పదార్థాలు రెండూ ఉంటాయి. అయితే, ఈ అనారోగ్యకరమైన పదార్థాల వల్ల శరీరంలోని ఇతర అవయవాలకు నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా కిడ్నీ అనారోగ్యానికి గురవుతుంటుంది.
తద్వారా ఇతర అవయవాలు కూడా అనారోగ్యానికి గురవుతాయి. కిడ్నీ దెబ్బతింటే ప్రధానంగా 3 లక్షణాలు ముందే కనిపిస్తాయి. బరువు తగ్గడం.. కిడ్నీ సరిగా పని చేయనప్పుడు శరీరంలో టాక్సిన్స్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. దీనివల్ల ఆకలిలో తేడా వస్తుంది. బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఆకలి వేయకపోవడం, ఉదయం వేళ వాంతులు రావడం వంటి సమస్యలు వస్తాయి. కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఏమీ తినాలని అనిపించదు. ఈ లక్షణాన్ని అస్సలు విస్మరించకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవాలి. పాదాల వాపు..మూత్రపిండాల వైఫల్యంలో మరొక తీవ్రమైన లక్షణం ఉంది. శరీరంలోకి వచ్చే అదనపు సోడియంను తొలగించడంలో కిడ్నీ అద్భుతంగా పని చేస్తుంది. అయితే, కిడ్నీ పనిచేయడం ఆగిపోపతే.. శరీరంలో సోడియం పేరుకుపోతుంది. దీని కారణంగా.. పాదాలలో వాపు కనిపిస్తుంది.
అలాగే, కళ్లు, ముఖం కూడా ఉబ్బుతుంది. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన.. మూత్రపిండాలు అనారోగ్యానికి గురయ్యాని గుర్తించడానికి మరో లక్షణం కూడా ఉంది. కిడ్నీ అనారోగ్యానికి గురైతే.. రాత్రిపూట మళ్లీ మళ్లీ మూత్ర విసర్జన వస్తుంది. సాధారణంగా మధుమేహ బాధితులకు తరచుగా మూత్రం వస్తుంటుంది. మధుమేహం సమస్య లేని వారు, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లయితే తరచుగా మూత్రం వస్తుంటుంది. అలాంటి సందర్భంలో వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవాలి.