Health

Kissing : ఒక ఆ ముద్దు 80 మిలియన్ బ్యాక్టీరియాను బదిలీ చేస్తుంది, ఒక్కసారి ఆలోచించండి.

Kissing : ఒక ఆ ముద్దు 80 మిలియన్ బ్యాక్టీరియాను బదిలీ చేస్తుంది, ఒక్కసారి ఆలోచించండి.

Kissing : నుదుటిపై, బుగ్గలపై ముద్దు పెట్టుకుంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అదే పెదాలతో ముద్దు పెట్టుకుంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. పెదాల చర్మం చాలా పల్చగా ఉంటుంది. ఈ చర్మం కింద ఎన్నో నరాలు ఉంటాయి. పెదవుల్లోని నరాలు చాలా సున్నితంగా ఉంటాయి. అయితే ఓపెన్ యాక్సెస్ జర్నల్ మైక్రోబయోమ్​లో ఈ పరిశోధన గురించి ప్రచురించారు. 10 సెకన్లు ముద్దు పెట్టుకుంటే.. 80 మిలియన్ల బ్యాక్టీరియా బదిలీ అవుతుందని దీనిలో రాసుకొచ్చారు. అలాగే రోజుకు తొమ్మిదిసార్లు ఒకరినొకరు ముద్దుపెట్టుకునేవారు ఒకే రకమైన నోటి బ్యాక్టీరియాను పంచుకుంటున్నట్లు గుర్తించారు. ముద్దుకు ముందు.. ముద్దు తర్వాత..నెదర్లాండ్స్​లో మైక్రోపియా, TNO పరిశోధకులు 21 జంటలపై ఈ అధ్యయనం చేశారు.

Also Read: షుగర్ ఉన్న వారు ఎక్కువగా మద్యం తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

వారు లిప్​ కిస్​ ఫ్రీక్వెన్సీ నుంచి.. ముద్దు పెట్టుకున్నప్పుడు వారు ప్రవర్తించే అంశాలపై డేటా సేకరించారు. అలాగే ముద్దు తర్వాత పరిశోధన కోసం ముద్దుకు ముందు.. ముద్దు తర్వాత వారి లాలాజలం సేకరించి.. నోటి మైక్రోబయోటాను తీసుకున్నారు. ఎక్కువసార్లు లిప్​ కిస్ పెట్టుకున్నప్పుడు వారి లాలాజల మైక్రోబయోటా ఒకేలా మారుతుందని ఫలితాలు నిరూపించాయి. అలాగే రోజుకు తొమ్మిదిసార్లు ముద్దు పెట్టుకునేవారిలో ఈ పరిస్థితి గణనీయంగా ఉంటుందని తేల్చారు. పరిశోధన దానిపై మాత్రమే.. ఈ అధ్యయనంలో కేవలం బ్యాక్టీరియా బదిలీపై మాత్రమే దృష్టి పెట్టింది.

కానీ వైరస్​లు, ఇతర వ్యాధికారక కారకాలపై కాదు. అంటే ముద్దు పెట్టుకునే సమయంలో బ్యాక్టీరియా బదిలీ వల్ల కలిగే బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్​పై ఫోకస్ చేయలేదు. ముద్దుకు ముందు ఉన్న బ్యాక్టీరియా, ముద్దు తర్వాత ఉన్న బ్యాక్టీరియా పరిమాణాలను మాత్రమే విశ్లేషించారు. దీనిలో ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన బ్యాక్టీరియా ప్రొఫైల్ కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. అవి వారి ఆరోగ్యం, ఆహారం, లైఫ్​స్టైల్​ వల్ల ప్రభావితమవుతుందని తేల్చారు. అయితే భాగస్వాముల మధ్య జన్యు పదార్ధాల మార్పిడిలో ముద్దు ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు.

Also Read: చీరను ఇలా కట్టుకునే వారికీ పెట్టికోట్ క్యాన్సర్​ వచ్చే ప్రమాదం.

బ్యాక్టీరియా అవసరమే.. మానవ శరీరంలో 100 ట్రిలియన్ల కంటే ఎక్కువ సూక్షజీవులు ఉంటాయి. సూక్ష్మ జీవుల పర్యావరణ వ్యవస్థ, మైక్రోబయోమ్స్ ఆహారాన్ని జీర్ణం చేయడానికి, పోషకాలను శరీరానికి అందించడానికి.. వ్యాధులను నివారించడానికి అవసరం అవుతాయి. ఇవి తీసుకునే ఆరహారం, వయసు ద్వారా ప్రభావితమవుతాయి. అయితే వీటితో పాటు ముద్దు కూడా బాక్టీరియాపై పరోక్షంగా ప్రభావం చూపిస్తుందట. ఎందుకంటే నోరు 700 కంటే ఎక్కువైన బాక్టీరియాలకు హోస్ట్​గా ఉంటుంది. కాబట్టి నోటి మైక్రోబయోటా కూడా ఇతరులను ముద్దు పెట్టుకోవడం వల్ల ప్రభావితం అవుతున్నట్లు గుర్తించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker