ఆపరేషన్ చేయకుండా మోకాళ్ల నొప్పిని తగ్గించే అద్భుతమైన రెమిడీ.
పగటి పూట అలసిపోయేంత పని చేస్తే ఆ రోజు రాత్రి నొప్పి ఎక్కువగా ఉంటుంది. మరికొందరు రోజు రాత్రి నొప్పులతో ఇబ్బందిపడుతుంటారు. చాలామంది వీటిని తగ్గించేందుకు పెయిన్ కిల్లర్స్ తీసుకొని నిద్రపోతుంటారు. అయితే మోకాళ్ళ నొప్పులతో 40 ఏళ్ల వయసు నుంచే బాధపడటం పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్తోనే వాళ్ళ జీవన విధానం గడవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడడం చూస్తుంటాం. మరి మోకాళ్ళ నొప్పులకు మంచి రెమిడీ ఇప్పుడు చెప్తున్నాను.
అదే హాట్ మట్ ప్యాక్ ఇది మోకాళ్ళకి ప్యాక్ లాగా వేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం పొలాల్లో దొరికే మెత్తటి మట్టిని తీసుకోవాలి. ఈ మట్టిని ఒక నీటిలో నానపెట్టేసుకోవాలి. ఈ నానిన చల్లటి మట్టిని పొయ్యి మీద పెట్టి50 డిగ్రీలు వేడి చేయాలి. అంతకంటే ఎక్కువ అయితే మనకి స్కిన్ కాలుతుంది. అన్నమాట. అలా మట్టి వేడిగా ఉన్న దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మోకాళ్ళకు నొప్పులు గుంజడానికి ఆలివ్ ఆయిల్ తెచ్చుకోండి.
అలాగే ముద్ద కర్పూరం వేసి కరగనివ్వాలి. ఈ నూనెను తీసుకొని మోకాళ్ళకు పెట్టి కాసేపు మర్దన చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత అది అంతా ఇంకిపోయిన తర్వాత మజిల్ రిలాక్సినేషన్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ముందుగా వేడి చేసుకున్న మట్టిని తీసుకువచ్చి మోకాళ్ళకి చైర్ లో కాళ్లు పెట్టుకొని వెనక భాగం ముందు భాగం మట్టిని బాగా అప్లై చేయాలి. ఇలా మట్టి అంత అప్లై చేసిన తర్వాత ఒక గుడ్డ తీసుకొని ఆ మట్టి మీద చుట్టుకోవాలి. ఈ మట్టి ఎక్కువసేపు వేడి అలాగే ఉంటుంది.
ఇలా నొప్పి వచ్చినప్పుడు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఈ మట్ ప్యాక్ ని ఉదయం పూట లేదా వర్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇలా రెండుసార్లు ఈ ప్యాక్ ని వేసుకుంటే మంచి రిలీఫ్ వస్తుంది. ఏ వయసు వారైనా సరే ఇంగ్లీష్ మెడిసిన్స్ ని వాడకుండా ఇలా అలివ్ ఆయిల్, ముద్ద కర్పూరం మట్టి తో ఇలా చేసుకుంటే మోకాళ్ళ ఆపరేషన్ లేకుండా ఎంతో ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు.