Health

కొరియా అమ్మాయిల అందం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?

ఊబకాయంతో కనిపించే కొరియన్లు చాలా అరుదుగా కనిపిస్తారు. 60-70 ఏళ్లు దాటినవారు కూడా చక్కటి శరీరసౌష్టవంతో చక్కగా కనిపిస్తారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా కొరియన్ మహిళల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీరి శరీరాకృతి ఎంతో మందిలో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మెరిసే అందమైన చర్మం కోసం మహిళలు అనేక రకాల చిట్కాలను అనుసరిస్తారు.

అంతేకాదు మార్కెట్‌లో ఏది కొత్తగా వస్తే ఆ బ్యూటీ ప్రొడాక్ట్‌ వాడుతారు. అందంపై చాలా శ్రద్ద తీసుకుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత అందంగా కనిపించే దక్షిణ కొరియా మహిళలు మాత్రం అందం కోసం చెంపదెబ్బలు తింటారు. అవును మీరు విన్నది నిజమే. దీని పేరు స్లాప్ థెరపీ. స్లాప్ థెరపీతో ఎక్కువ ఖర్చు లేకుండా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. స్లాప్ థెరపీ అంటే నెమ్మదిగా చెంపలపై కొట్టడం. దీంతో ముఖంపై రక్త ప్రసరణ పెరుగుతుంది.

దీని వల్ల చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా మారుతుంది. ఈ చికిత్సని పురుషులు, మహిళలు ఇద్దరూ చేస్తారు. ఈ థెరపీ చర్మంలోని రంధ్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దక్షిణ కొరియా ప్రజలు ఈ చికిత్సను ఎక్కువగా అనుసరిస్తారు. చెంపదెబ్బలు కొట్టడం వల్ల ముఖంలోని ప్రతి భాగంలో రక్త ప్రసరణ వేగంగా జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.

దీని వల్ల చర్మం మెరుస్తుంది. ఈ థెరపీలో రెండు చేతులతో చెంపలపై కొట్టుకోవాలి. అమెరికన్ ప్రజలు కూడా చెంపదెబ్బల వల్ల చర్మంపై తెరుచుకున్న రంధ్రాలు తగ్గుతాయని చెప్పారు. దీంతో పాటు చర్మం క్రీములు, నూనెలను చాలా బాగా గ్రహిస్తుందని తెలిపారు. ఇది చర్మాన్ని మృదువుగా చేసి ముడతలను తగ్గిస్తుందన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker