News

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి గాయం, ప్రస్తుతం ఎలా ఉందంటే..?

మెగా కుటుంబ సభ్యులు అందరు.. సంబరాల్లో మునిగి తేలుతుంటే.. లావణ్య మాత్రం ఇంటికే పరిమితం అయ్యారు. ఎందుకంటే ఆమెకి కాలికి గాయం అయిందంట.. తన కుడి కాలికి గాయం అయిందని.. తానూ ప్రస్తుతానికి కోలుకుంటున్నాను అంటూ.. తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. దీనితో ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ గాయం షూటింగ్ సమయంలో జరిగిందా..

ఇంట్లోనే జరిగిందా అని అయితే చెప్పలేదు కానీ.. కేవలం ఓ పోస్ట్ తో.. ఆమె అభిమానులకు సమాధానం ఇచ్చేసింది. అయితే అయితే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందిన రోజున తన అన్న ఆశీర్వాదం కోసం చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో వరుణ్ తేజ్ తో పాటు లావణ్య త్రిపాఠి కూడా కనిపించింది. కానీ అప్పుడు ఆమె కాలికి ఎలాంటి కట్టు కనిపించలేదు. ఆ తరువాత ఆమె కాలికి గాయమైనట్లుగా చెబుతున్నారు.

అయితే ఈ గాయం షూటింగ్ చేస్తున్న సమయంలో జరిగిందా? లేక ఇంట్లోనే ఏదైనా గాయం జరిగిందా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఇక గాయమైన నేపథ్యంలో ఆమె పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయినట్లుగా తెలుస్తోంది. మరొక పక్క పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

దానికి తగ్గట్టుగానే చిరంజీవి, అమిత్ షా, అఖిరా నందన్ వంటి వాళ్ళు డిప్యూటీ సీఎంకి అభినందనలు అంటూ పోస్టులు పెట్టడంతో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఖరారు అయినట్లే. అయితే మంత్రివర్గం ప్రకారం ఎలాంటి శాఖ ఆయనకు ఇవ్వబోతున్నారు అనే విషయం మీద చర్చ జరుగుతుంది. పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతున్నా, అధికారిక ప్రకటన వచ్చేవరకు ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం తక్కువే.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker