Health

Liver: మీ లివర్ ప్రమాదంలో ఉందని కనిపించే సంకేతాలు ఇవే, నిర్లక్ష్యం చేస్తే అంటే సంగతులు.

Liver: మీ లివర్ ప్రమాదంలో ఉందని కనిపించే సంకేతాలు ఇవే, నిర్లక్ష్యం చేస్తే అంటే సంగతులు.

Liver: లివర్ డ్యామేజ్ ముఖ్య లక్షణాలు పచ్చకామెర్లు, వాపులు, ఆకలి తగ్గడం, తరచూ వాంతులు, ఎల్లో కలర్ యూరిన్ ఉంటాయి. వీటిని గమనించి వైద్యుని సంప్రదించడం అవసరం. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం, సమతుల్య ఆహారం, మద్యపానం, ధూమపానాన్ని తగ్గించడం ముఖ్యమైనవి. సరైన జీవనశైలి తీసుకోవడం, నిపుణుల సూచనలను పాటించడం ద్వారా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపర్చవచ్చు. అయితే కాలేయం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముఖ్యంగా ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. చాలా సార్లు కాలేయం పనిచేయకపోవడం, వైఫల్యం అనేది గుర్తించకుండానే జరుగుతుంది.

Also Read: మళ్ళీ బయపెడుతున్న నోరోవైరస్.

ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. కాలేయం ఇబ్బందుల్లో పడితే.. దాని లక్షణాలు వ్యక్తి ముఖం.. శరీరంపై కనిపించడం ప్రారంభిస్తాయి. ఒక వ్యక్తి ముఖం లేదా శరీరంపై అలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వీటిలో కామెర్లు, అలసట, బలహీనత, కడుపు నొప్పి లేదా వాపు, ఆకలి లేకపోవడం, వాంతులు లేదా వికారం, నలుపు లేదా ముదురు మూత్రం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.. మీకు ముఖ్యంగా ఈ లక్షణాలు ఏవైనా అనిపిస్తే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. కామెర్లు.. కామెర్లు ఒక సాధారణ లక్షణం.. దీనిలో చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. మొహంపై మొటిమలు పెరుగుతాయి.

ముఖం గ్లో కూడా తగ్గుతుంది. కాలేయం బిలిరుబిన్‌ను సరిగ్గా క్లియర్ చేయలేనప్పుడు ఇది జరుగుతుంది.చర్మంపై దురద – నీరసం.. కాలేయ వైఫల్యం కారణంగా చర్మంపై దురద సంభవించవచ్చు. రక్తంలో కలుషితాలు చేరడం వల్ల దురద సమస్య పెరుగుతుంది. ఎల్లప్పుడూ నీరసంగా ఉంటుంది. చర్మం, మొహం పై మచ్చలు.. కాలేయ వైఫల్యం కారణంగా, చర్మంపై లేత లేదా ముదురు రంగు మచ్చలు లేదా బర్త్‌మార్క్‌లు కూడా కనిపిస్తాయి.. వీటిని “లివర్ స్పాట్స్” అని కూడా పిలుస్తారు. నల్ల మచ్చలు.. కాలేయ వైఫల్యం కారణంగా, శరీరంలో హార్మోన్ల మార్పులు కూడా సంభవిస్తాయి.. ఇది చర్మం రంగును ప్రభావితం చేస్తుంది.

Also Read: ఇలా చేస్తే మీకు జీవితంలో థైరాయిడ్ సమస్య అసలు రాదు.

నల్ల మచ్చలు కనిపించడానికి కారణమవుతుంది. గోర్ల రంగు మారడం- చర్మం పొడిబారడం.. కాలేయం దెబ్బతినడం వల్ల, గోళ్ల రంగు కూడా పసుపు రంగులోకి మారడం పెళసుగా మారడం కనిపసిస్తుంది.. ఇంకా చర్మం పొడిబారడం లేదా పగుళ్లు ఏర్పడే సమస్య రావచ్చు. కాలేయ వ్యాధులు..కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే, ఒకేసారి అనేక వ్యాధులు వస్తాయి. కాలేయ సిర్రోసిస్, హెపటైటిస్, ఫ్యాటీ లివర్, కాలేయ క్యాన్సర్, కాలేయ వైఫల్యం వంటి అనేక తీవ్రమైన వ్యాధులు సంభవించవచ్చు.. ఇవి తీవ్రమైన ప్రమాదాన్ని సూచిస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker