Lizard Vastu: ఇంట్లో దేవుడిగుడిలో బల్లులు తిరుగుతున్నాయా..? అది దేనికీ సంకేతమో తెలిస్తే..?

Lizard Vastu: ఇంట్లో దేవుడిగుడిలో బల్లులు తిరుగుతున్నాయా..? అది దేనికీ సంకేతమో తెలిస్తే..?
Lizard Vastu: హిందూ పురాణాల ప్రకారం, బల్లులు కొన్ని దేవతలతో సంబంధం కలిగి ఉంటాయి. ఉదాహరణకు, కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బల్లులను బంగారం, వెండితో చెక్కారు. వాటిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అయితే హిందూ సంప్రదాయంలో బల్లులకు ప్రత్యేక స్థానం ఉంది.

కొన్ని ఆలయాల్లో ఉదాహరణకు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో.. బల్లులను బంగారం, వెండితో చెక్కి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. అలాగే తిరుచ్చిలోని శ్రీరంగం ఆలయంలో స్వర్గ ద్వారం దగ్గర బంగారు బల్లుల చిత్రాలు ఉంటాయి. భక్తులు వాటిని పూజించి ఆ తర్వాత ఆలయంలోకి వెళతారు.
Also Read: విశాల్-సాయి ధన్సికల పెళ్లి వాయిదా..!
సాధారణంగా బల్లులు ఇంట్లో వెచ్చగా, సురక్షితంగా ఉండే చోట్లకు వస్తాయి. దేవుడి పటాలు గోడలపై ఉంటే, వాటి వెనుక ఉన్న చిన్న స్థలం బల్లులకు దాక్కునే చోటుగా మారుతుంది. కొందరు దీన్ని దేవుడి ఆశీర్వాదంగా భావిస్తారు. బల్లులు ఇంట్లో అదృష్టాన్ని, రక్షణను తెస్తాయని నమ్మే వాళ్లూ ఉన్నారు. అయితే కొందరు మాత్రం బల్లులను అపరిశుభ్రంగా భావిస్తారు.
Also Read: ఇంట్లోకి వచ్చిన పామును పామును చేత్తో పట్టుకున్న సోనూసూద్.
దేవుడి పటాల దగ్గర బల్లులు ఉంటే అది చెడు సంకేతంగా లేదా ప్రతికూల శక్తిగా భావిస్తారు. ముఖ్యంగా బల్లులకు భయపడే వాళ్లు దీన్ని చూసి ఆందోళన చెందవచ్చు. ఈ విషయం మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూసే వాళ్లు దీన్ని మంచి శకునంగా భావించవచ్చు.

బల్లులు అసహ్యంగా ఉంటాయని భావించే వాళ్లకు ఇది చెడు సంకేతంగా కనిపించవచ్చు. నిజానికి ఇవి సాధారణ పర్యావరణ ప్రక్రియలు కావచ్చు. మీకు ఏది సంతోషాన్ని, శాంతిని ఇస్తే ఆ విధంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు.