రోజు రెండు తులసి ఆకులు తింటే లో బీపీ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారు.

చాలా మంది లోబీపీని లైట్‌గా తీసుకుంటారు. కానీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. లోబీపీని హైపోటెన్షన్ అని కూడా అంటారు. సాధారణంగా బీపీ లెవల్ 120/80 mm Hg ఉండాలని వైద్య నిపుణులు చెబుతారు. మహిళల్లో 60/100 mm Hg , మగవారిలో 70/110 mm Hg కంటే తక్కువగా ఉంటే దాన్ని లోబీపీ అంటారు. బీపీ ఈ స్థాయికి పడిపోతే నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లోబీపీ లక్షణాలను గుర్తించి జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పు చేసుకుంటే బీపీని సాధారణ స్థితి తీసుకురావచ్చని సూచిస్తున్నారు.
అయితే ఆరోగ్యంపై లో బీపీ ప్రభావం ఉంటుందనే విషయం తెలిసినప్పటికీ.. చాలామంది లో బీపీ సమస్యను లైట్ తీసుకుంటుంటారు. హై బీపీ సమస్యను చూసినంత తీవ్రమైన సమస్యగా లో బీపీని చూడరు. కానీ లో బీపీ సమస్యను కూడా తీవ్రంగా పరిగణించకపోతే దాని ప్రభావం ఆరోగ్యంపై కచ్చితంగా ఉంటుందంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. అయితే లో బీపీ సమస్య అనేది చాలా మందికి ఉంటుందట.
కానీ తమలో లో బీపీ సమస్య ఉందని గుర్తించడంలోనే చాలా మంది విఫలం అవడం వల్లే వారికి ఆ సమస్య ఉందనే విషయం కూడా తెలిసే అవకాశం ఉండదు. ఇంకొంతమంది తెలియకుండానే తమకు ఉన్న లో బీపీ సమస్యను బలహీనతగానో లేక మరొక రకమైన ఆరోగ్య సమస్యగానో భావించి కొట్టిపారేస్తుంటారు. కానీ అదే తాము చేస్తోన్న అసలైన పొరపాటు అనే విషయం చాలా మందికి తెలియదు. లోబీపీ రావడానికి గల కొన్ని కారణాలతో పాటు లో బీపీ సమస్యను నయం చేసేందుకు ఉపయోగపడే హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డిహైడ్రేషన్ సమస్య.. శరీరానికి తగినంత నీరు అవసరం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు, రక్త సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతాయి. రక్త నాళాల ద్వారా రక్తాన్ని పంప్ చేసేందుకు గుండె ఎప్పటికంటే ఇంకొంత ఎక్కువే శ్రమించాల్సి ఉంటుంది. దీంతో లో బీపీ సమస్య తలెత్తుతుంది. గర్భం.. ప్రెగ్నెన్సీ సమయంలోనూ లో బీపీ సమస్య రావడం అనేది సర్వసాధారణం.
గుండె సంబంధిత సమస్యలు.. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి శరీరంలో రక్త ప్రసరణ పని తీరుకు అంతరాయం కలుగుతుంది. అందుకే గుండె సరిగ్గా పని చేయకపోయినా.. శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోయినా.. లో బీపీ సమస్య వస్తుంది. పోషకాహార లోపం.. విటమిన్ B-12, ఐరన్ వంటి కొన్ని పోషకాహార లోపం వల్ల బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. ఇది రక్తహీనతగా మారుతుంది.