ఇలా మచ్చలు కనిపిస్తున్నాయా..? మధుమేహ వ్యాధి కావొచ్చు.
మధుమేహం ప్రారంభ లక్షణాలు అంత త్వరగా గుర్తించలేము. తెలయకుండానే శరీరం బాధపడటం మొదలుపడుతుంది. మీరు కొన్ని సంకేతాలను గమనిస్తే.. మీ రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉందని మీకు తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఇప్పటివరకు మనం డయాబెటిస్ అంటే.. అతిగా మూత్రం రావడం, కాళ్లు తిమ్మిరెక్కడం వంటివి మాత్రమే ప్రధాన లక్షణాలని భావిస్తున్నాం. అయితే, కొంతమందిలో ఈ లక్షణాలు కూడా కనిపించవు.
డయాబెటిస్ వల్ల చర్మంలో కూడా మార్పులు ఏర్పడతాయి. వాటిని వెంటనే గుర్తించడం ద్వారా డయాబెటిస్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. చర్మం మీ దద్దుర్లు, నల్ల మచ్చలు: డయాబెటిస్ వల్ల చర్మం మీద దద్దుర్లు కూడా ఏర్పడతాయి. వాటిని స్కిన్ అలర్జీ అనుకొని నిర్లక్ష్యం చేస్తే.. అవి మరింత ముదురుతాయి. చాలామంది డయాబెటిస్ బాధితుల్లో చర్మం మీద నల్ల మచ్చలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెడ, చంకల్లో చర్మం నల్లగా మారుతుంది.
వాటిని తాకితే మెత్తగా అనిపిస్తుంది. ఇది కూడా డయాబెటిస్ సంకేతమే. ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘అకాంతోసిస్ నిగ్రికాన్స్’ అని అంటారు. ఇన్సులిన్ లోపం లేదా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఎరుపు, పసుపు లేదా గోదుమ రంగు మచ్చులు.. చర్మం దురద పెట్టడం లేదా మంట పుట్టడం కూడా ప్రి-డయాబెటిక్ లక్షణాల్లో ఒకటి. చాలామందిలో చర్మంపై పసుపు, ఎరుపు, గోదుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. వైద్య పరిభాషలో ఈ సమస్యను ‘నెక్రోబయోసిస్ లిపోయిడికా’ అని కూడా అని అంటారు.
డయాబెటీస్‌కు ముందు ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గాయాలు త్వరగా మానవు.. డయాబెటిస్‌తో బాధపడేవారికి గాయాలైతే అంత త్వరగా మానవు. రక్తంలో మితిమీరిన చక్కెర స్థాయిల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల చర్మంలోని నరాలు దెబ్బతింటాయి. రక్త ప్రవాహంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నరాలు దెబ్బతినడం వల్ల గాయాలు త్వరగా మానవు. ఈ పరిస్థితిని డయాబెటిక్ అల్సర్ అని కూడా అంటారు. మీలో ఈ సమస్య కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.