News

తండ్రికి కూతురంటే ప్రాణం, ఆమె మాత్రం ఇద్దరు లవర్స్‌తో కలిసి నాన్నను ఏం చేసిందో తెలుసా..?

మదనపల్లెలోని ఎగువ కురవంక ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలీకామ్ కాలనీలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి నివసిస్తున్నాడు. ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట మృతి చెందింది. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె హరిత ను దొరస్వామి కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. పూర్తీ వివరాలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌ జిలలా, అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో బుధవారం నాడు వెలుగు చూసింది. ఎగువ కురవంగ ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలికమ్ కాలనీలో దొరస్వామి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానిక జీఆర్‌టీ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తూ.. ఎంతో మంచివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దొరస్వామి భార్య స్నేహ.

ఏడాదిన్నర క్రితం ఆమె చనిపోయింది. వీరికి హరిత అనే పాతికేళ్ల కుమార్తె ఉంది. భార్య చనిపోయిన నాటి నుంచి దొరస్వామే కుమార్తె హరిత ఆలనాపాలన చూసుకుంటున్నాడు. హరిత కూడా బీఎస్సీ బీఈడీ చదివింది. మరి కొన్నాళ్లలో దొరస్వామి రిటైర్‌ కాబోతున్నాడు. రిటైర్మెంట్‌ డబ్బులతో బిడ్డకు పెళ్లి చేయాలని భావించాడు. ఈ క్రమంలో హరిత కోసం కుప్పంలో ఓ సంబంధం చూశాడు. అంతేకాక కుమార్తెకు కట్నంగా ఇవ్వడం కోసం 80 లక్షల విలువైన రూపాయల రెండంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసి.. బిడ్డ పేరు మీద రిజిస్టర్‌ చేయించాడు. మరి కొన్ని రోజుల్లో కుమార్తెకు పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయనుకున్న సమయంలో అనూహ్యంగా రెండు రోజుల క్రితం దొరస్వామి చనిపోయాడు.

ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దొరస్వామికి మద్యం సేవించే అలవాటు ఉంది. దానిలో భాగంగానే బుధవారం రాత్రి కూడా మద్యం తాగి నిద్రపోయారు. తెల్లారి చూసేసరికి రక్తపు మడుగులో శవమై కనిపించాడు. దాంతో చుట్టుపక్కల వారు దొరస్వామి మృతిపై మదనపల్లి పోలీసులకు సమాచారం అందింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఇక దొరస్వామి మృతి చెందిన సమయంలో ఇంట్లో ఆయన కుమార్తె హరిత మాత్రమే ఉంది. దాంతో పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ముందు.. ఇంట్లోకి ఎవరో ప్రవేశించి.. తండ్రిని హత్య చేశారని చెప్పిన హరిత.. పోలీసులు గుచ్చి గుచ్చి అడగడంతో.. తానే తండ్రిని హత్య చేశానని వెల్లడించింది.

తన తండ్రి దొరస్వామి తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతోనే ఈ పని చేశానని చెప్పుకొచ్చింది. కానీ పోలీసులు హరిత మాటలు నమ్మలేదు. దాంతో నిజం చెప్పమని బెదిరించడంతో అసలు విషయం వెల్లడించింది. తానే తండ్రిని హత్య చేశానని వెల్లడించింది. మరి తన మీదనే ప్రాణాలు పెట్టుకున్న తండ్రిని ఎందుకు హత్య చేసింది అంటే.. విచ్చలవిడితనం. హరితకు ఇద్దరు ప్రియుళ్లు ఉన్నారు. వారిద్దరితో ఇంట్లోనే రొమాన్స్‌ చేస్తుంది హరిత. ఒకరోజు ఒక ప్రియుడు.. మరోరోజు ఇంకో బాయ్‌ఫ్రెండ్‌ హరిత ఇంటికి వస్తాడు. కొద్ది రోజుల్లోనే హరిత వ్యవహారం చుట్టుపక్కల వాళ్లకి తెలిసింది.

దీని గురించి దొరస్వామికి చెప్పారు. కుమార్తె గురించి తెలుసుకున్న దొరస్వామి ఎంతో బాధపడ్డాడు. ఆమె జీవితం చేజారిపోకూడదని భావించి.. పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సంబంధాలు చూడటం ప్రారంభించాడు. కానీ హరిత మాత్రం తనకు పెళ్లి వద్దని చెప్పింది. ఈ విషయమై తండ్రి, కుమార్తెల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో ఆగ్రహించిన హరిత బాయ్‌ఫ్రెండ్స్‌ సాయంతో ఏకంగా తండ్రిని హత్య చేసింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker