కృష్ణ కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు.
సూపర్ స్టార్ కృష్ణ మరణం యావత్ సినీ లోకాన్ని కలచి వేసింది. కృష్ణ అనారోగ్యంతో కృష్ణ తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర వేదనకు గురైంది. చిత్ర పరిశ్రమ, అభిమానులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఇక హీరో మహేష్ వారి కుటుంబ సభ్యుల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు.
కృష్ణ గారి కర్మ రోజు అభిమానులకు పిలచి మరీ బోజనాలు పెట్టారు. అలాగే తెలుగు ప్రజలలో ఎంతో మంది తమ సొంత డబ్బులు ఖర్చు చేసి మరీ పేదలకు అన్నదానం చేశారు. కృష్ణ గారు చనిపోయిన నాటి నుండి మహేశ్ బాబు బయటకు రావటం లేదు. ఇక మరీ దగ్గరి వాళ్ల ఫోన్స్ అయితేనే రిప్లై ఇవ్వడం చేస్తున్నారు. మిగిలిన వారందరినీ పట్టించుకోవడం లేదు.
ఇక కార్యక్రమం జరిగిన రోజు స్టేజ్ మీద మీద మాట్లాడిన మహేశ్ బాబు తన తండ్రి గారైన కృష్ణ గారి ని తలచుకొని చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. అయితే తాజాగా మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారిని అందరూ గుర్తుంచు కొనేలా చేయటానికి తాను ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే సూపర్ స్టార్ కృష్ణ గారి పేరుతో అవార్డులు ఇవ్వాలని మహేష్ భావిస్తున్నారని తెలుస్తోంది.
అది కూడా అషామాషిగా కాకుండా నేషనల్ లెవల్ లో ది బెస్ట్ అన్నవారికి ఇచ్చేలా దానికి మంచి మోమెంటో, లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వాలని కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించారని అంటున్నారు. అలాగే తన మొమెంటో లతో , అవార్డ్స్ తో ఒక మ్యూజియం లాగా కట్టించాలని భావిస్తున్నాడు. ఇది విన్న సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.