మల్లెపూలను పక్కన పెట్టుకుని నిద్రపోండి, ఆ తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.
మల్లె అందం మగువకెరుక. మనసు బాధా తెలియదా అని అన్నా..ఇది మల్లెల వేళ అనీ…అంటూ పాడుకున్నా కంటెంట్ మాత్రం మల్లెపూలే. సృష్టిలో లభించే అందమైన పూలలో మల్లెపూల స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే తాజా మల్లెల్ని మెత్తగా నూరి… తడిబట్టపై చుట్టి కళ్లపై పెట్టుకుంటే కంటి నుంచి నీరు కారడం, తడి ఆరడం, కళ్లు మూసినా, తెరిచినా చికాకు ఉండటం వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతాం.
మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తోంది. తలనొప్పి లేదా తలంతా పట్టేసినట్టు ఉంటే మల్లెపూలతో వాసన కట్టు కడితే ఉపశమనం కలుగుతుంది. మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని తగ్గిస్తుంది. ఇక జుట్టు బలంగా ఉండటానికి కూడా మల్లెపూలు చాలా బాగా పనిచేస్తాయి. దీని కోసం కొబ్బరినూనెలో గుప్పెడు మల్లెపూలను వేసి ఒక రోజంతా నానబెట్టాలి. తరవాత కాచి వడగట్టాలి. చల్లారిన తరువాత ఆ నూనెను తలకు రాసి మర్దనా చేసుకుంటే జుట్టు కుదుళ్లకు మంచి పోషకాలు అందుతాయి.
కళ్లు మంటగా ఉన్నా… కంట్లో నొప్పిగా ఉంటే మల్లెల కషాయం దివ్యఔషధంలా పని చేస్తుంది.మల్లెపూలు, ఆకులతో ఈ కషాయం కాయాలి. ఈ కషాయాన్ని వడ గట్టి చల్లార్చిన తరువాత రెండు వంతుల కషాయంలో ఓ వంతు నువ్వుల నూనె, ఓ వంతు కొబ్బరి నూనె, ఒక స్పూన్ బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు తలకు మర్దనా చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు మల్లెపూల ఛాయ్ తాగాల్సిందే. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గంచే గుణం మల్లెపూలకు ఉంది.
మీరు ఎండలో రోజంతా తిరిగి అలసిపోయిన తరువాత మీ ముఖానికి మల్లెపూలతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ మిశ్రమాన్ని పూయండి. ఇది మీకు తక్షణ తాజాదనం ఇస్తుంది. తరచూ ఎదురయ్యే మానసిక వ్యాకులత, డిప్రెషన్, అతికోపం, మానసిక చంచలత్వాన్ని స్థిరపర్చి శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉందంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. చక్కటి సువాసన వెదజల్లే గుప్పెడు పూలను దిండు కింద పెట్టి పడుకోవడం గానీ లేదా దీర్ఘంగా సువాసన పీల్చడం గానీ చేయాలి. ఇలా రోజుకు పదిసార్లు చేస్తే నిద్ర హాయిగా పడుతుంది. మనస్సు స్థిమితంగా ఉంటుంది.