మందారం నూనెతో ప్రతీ అమ్మాయి అందం రెట్టింపు అవుతుంది.
మందార నూనెతో తలవెంట్రుకలను పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పాదాల సంరక్షణలోనూ తన ఉనికి కాపాడుకుంతోంది. పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ చేయటం మంచిది. ముఖాన్ని వైట్ గా మరియు బ్రైట్ గా మార్చుకునేందుకు పైసా ఖర్చు లేకుండా ఇళ్లల్లో ఉండే మందారం పూలు ఉపయోగించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే మందారం నూనె జుట్టు పెరుగుదలను పెంచుతుంది.
అలాగే జుట్టును మూలాల నుండి బలపరుస్తుంది. ఇది జుట్టు మెరుస్తూ కనిపించేలా చేస్తుంది .మందారలో విటమిన్-సి సమృద్ధిగా ఉండడం వలన జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌదర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పడతాయి. ఈ మొక్క నుంచి నూనె కూడా తయారు చేస్తారు. మందార నూనె తలవెంట్రుకలను పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మం, కేశాలు మృదువుగా ఉందేందుకు తోడ్పడుతుంది. మందారలు కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలు మరింత మెత్తగా మారి అందానీ, మెరుపుని ఇస్తుంది. ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు నివారించవచ్చు.జుట్టు రాలటం తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కేశాలు తెల్ల బడకుండా ఉపకరిస్తుంది. చర్మం నునుపుగ ఉండెల చూస్తుంది. చర్మం లో మృత కణజాలం లేకుండా చూస్తుంది.
స్నానానికి వెళ్లే ముందు మందార నూనె నీటిలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధ భరితంగా కూడా ఉంటుంది. పాదాల సంరక్షణలోనూ ఎంతగానో ఉపయోగ పడుతుంది. పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ చేస్తే మంచి ఫలితాలొస్తాయి. మందార పువ్వు గాని, ఆకులను గాని బాగా ఎండలో ఎండపెట్టి వాటిని మెత్తని పొడిలా చేసి నూనెలో కలిపి తలకు రాసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.. అలాగే మందార పువ్వులు కూడా మనకు విరివిగా దొరుకుతాయి. ఖర్చులేని పని తప్పకుండా ట్రై చేయండి.