సింగర్ మంగ్లీ ఒక్కోపాటకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా..?
మంగ్లీ అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో పుట్టింది. తాండలోనే 5వ తరగతి చదివింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్ లో చదివింది. RDT సంస్థ ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది. ఆదే సంస్థ సలహాతో, ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్నాటక సంగీతం నేర్చుకుంది. వారి ఆర్థిక సహాయంతోనే పదో తరగతి తర్వాత ఎస్. వి. విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరింది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.
జూనియర్లుగా ఉన్నవాళ్లు సీనియర్లు గామారుతారు.. చిన్నా చితగా సింగర్లు,. యాక్టర్లు స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుంటారు. మరికొంత మంది మాత్రం ఎలా ఉన్నారో అలానే ఉండిపోతుంటారు. ఈ నేపథ్యంలోనే చిన్న స్థాయి నుంచి స్టార్ గా చాలా తక్కువ టైమ్ లోనే ఎదుగుతూ వస్తుంది మంగ్లీ. ఈక్రమంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకున్నట్టుంది మంగ్లీ.. అందరిమాదిరిగానే అన్నట్టుగా.. టైమ్ వస్తే చాలు.. రేట్లు పెంచేస్తుంటారు. కెరీర్ సాగినంత వరకూ మస్త్ గా సంపాదించుకోవాలి అనే చూస్తారు.
ఈక్రమంలో సింగర్ మంగ్లీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. సాధారణ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది మంగ్లీ. ప్రస్తుతం తెలుగులో స్టార్ సింగర్‌గా కంటిన్యూ అవుతుంది.ఈ మధ్య తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేసిందట మంగ్లీ. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా ఇంత అంతా కాదు.. అమాంతం రేటు పెంచేసిందట మంగ్లీ. జానపద పాటలు పాడుకుంటూ.. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకునే మంగ్లీ.. చిన్నగా ఆల్బమ్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఆతరువాత వరుసగా సినిమా అవకాశాలు సాధిస్తూ వస్తోంది.
ఒక పాట హిట్ అవ్వడంతో మరో పాట..అలా వరుసగా సాంగ్స్ పాడేస్తోంది.రాములో రాములా, సారంగదరియా, జింతక్ చితక్, ఊరంతా, బుల్లెట్, జ్వాలారెడ్డి, కన్నే అదిరింది, రా రా రక్కమ్మ లాంటి హిట్ సాంగ్స్ ను పాడింది మంగ్లీ. మంగ్లీ పాడిన ఆ పాటలన్నీ.. బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో పాటు.. యూట్యూబ్‌లో కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టాయి. ఇంత ఇమేజ్ రావడంతో మంగ్లీ.. ఒకప్పుడు పాటకు 20 వేలు తీసుకునే మంగ్లీ.. ఇప్పుడు ఒక్కో పాటకు ఏకంగా 3 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట. అటు మూవీ మేకర్స్ కూడా మంగ్లీ పాడితే తమ సినిమాలకు ప్లాస్ అవుతుందన్న కారణంతో.. ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతుననారట.