పెళ్లికి ముందు రోజు రాత్రి వధూవరులు అస్సలు చేయకూడని పనులు ఇవే.

పెళ్ళి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం.
అయితే పెళ్లి అనేది కొత్త జీవితానికి నాంది. వివాహం తర్వాత మీ వైవాహిక జీవితంలో చాలా మార్పులు సంభవిస్తాయి. కొన్ని బాధ్యతలు మీపై పడతాయి. కాబట్టి.. పెళ్లికి ముందే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వివాహానికి ముందు కొన్ని పనులు చేయడం వల్ల మీ పెళ్లికి అడ్డంకులు ఏర్పడవచ్చు. లేదా మీ కొత్త జీవితాన్ని.. కొత్త సంబంధాలను కూడా ప్రభావితం చేయవచ్చు. మద్యపానం.. వ్యసనం అనేది మన ఆలోచన నుంచి శారీరక వ్యక్తీకరణ వరకు ప్రతి దాన్నీ మారుస్తుంది.
కాబట్టి పెళ్లికి ముందు రోజు వధూవరులు మద్యం సేవించకూడదు. లేకుంటే పెళ్లిలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్ గా వరుడు అతిగా మద్యం తాగి వచ్చాడని.. పెళ్లి కూతురు విహహన్ని రద్దు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కాబోయే భాగస్వామితో మాట్లాడటం.. పెళ్లికి ముందు రోజు.. లేకపోతే అంతకుముందు కాబోయే భాగస్వామితో ఎక్కువ మాట్లాడకండి. ముఖ్యంగా ఫోన్ లో మాట్లాడం, మెసేజ్ లు పంపడం వంటివి చేయకండి.
ఒకవేళ పెళ్లి రద్దు అయితే.. మీరు భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముంది. మాజీ ప్రేయసి/ ప్రియుడితో సమావేశం.. కొత్త జీవితంలోకి అడుగు పెట్టేటప్పుడు పాతదాన్ని మరచిపోవడం మంచిది. కాబట్టి మీరు ఏమి అనుకున్నా.. పెళ్లికి ముందు రోజు మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుణ్ని కలవకండి. ఇలా చేస్తే.. మీ వివాహానికి పెద్ద అడ్డంకి వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి.. వివాహం అనేది మానసికంగా తీవ్ర ఒత్తిడితో కూడుకున్నది.
పెళ్లికి ముందు రోజు ఎక్కువ ఒత్తిడికి గురికావద్దు. ఖాళీ కడుపుతో కూడా ఉండకండి. ఇలా చేయడం వల్ల పెళ్లి రోజు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మంచి నిద్ర కూడా మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. ఫిర్యాదు చేయడం.. పెళ్లిలో ఏదైనా ఇష్టం లేకుంటే.. ఫిర్యాదు చేయడం మానేయండి. ఆచారాలు.. వ్యవహారాలు అభ్యంతరకరంగా ఉన్నా ఫిర్యాదు చేయకండి. ఇలా చేస్తే.. మీ కొత్త జీవితంలో ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదముంది.