పెళ్ళికాని యువతి యువకులకు అలెర్ట్, ఈ విషయాలు మీకోసమే.
వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. అయితే ప్రస్తుతం చాతుర్మాసం జరుగుతోంది. చాతుర్మాసం అంటే నాలుగు నెలలు.
వ్రతము, పూజ మొదలైనవాటికి ఈ మాసాలు చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ, సాధారణంగా ఈ సమయంలో వివాహం, ఉపనయనం, నామకరణం, నిశ్చితార్థం మొదలైన శుభ కార్యాలు మాత్రం చేయరు. ఎందుకంటే చాతుర్మాస సమయంలో అంటే దేవశయని ఏకాదశి నుండి దేవతని ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలో నిమగ్నమై ఉంటాడు. అందుకే ఈ సమయంలో పెళ్లిలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఏడాది చాతుర్మాసం జూలై 10వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇది నవంబర్ 4న అంటే దేవతని ఏకాదశితో ముగుస్తుంది. చాతుర్మాసాలు అంటే… శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక. ఆ తర్వాత అంటే నవంబర్, డిసెంబర్ మాసాల్లో పెళ్లిళ్లు ముహూర్తాలు ఉన్నాయి. అయితే, ఇంట్లో శుభకార్యాలకు నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏయే తేదీలు వివాహానికి శుభప్రదమో తెలుసుకుందాం. వివాహ ముహూర్తం 2022.. దేవతని ఏకాదశి తర్వాత అంటే నవంబర్ 4వ తేదీ విష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు.
తులసి కళ్యాణం పూర్తయిన తర్వాత వివాహానికి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. వివాహానికి గ్రహాలు, రాశుల శుభ స్థానము కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి, ఈ సంవత్సరం నవంబర్ 21 నుండి వివాహానికి అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది. నవంబర్‌లో పెళ్లి కి మంచి ముహూర్తాలు ఇవే..21 నవంబర్ 2022, 24 నవంబర్ 2022, 25 నవంబర్ 2022, 27 నవంబర్ 2022, డిసెంబరులో వివాహ తేదీలు..2 డిసెంబర్ 2022, 7 డిసెంబర్ 2022, 8 డిసెంబర్ 2022, 9 డిసెంబర్ 2022, 14 డిసెంబర్ 2022,
దేవుతాని ఏకాదశి దేవుతాని ఏకాదశి 2022ని దేవుప్రదోహిని ఏకాదశి అని కూడా అంటారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున మాత తులసి, శాలిగ్రామ వివాహం సంప్రదాయం ఉంది. దేవతలను పూజించకుండా ఏ శుభకార్యమూ సాధ్యం కాదు. చాతుర్మాస సమయంలో విష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు. ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. ఈ కారణంగా చాతుర్మాసంలో 4 నెలల పాటు పెళ్లిళ్లు చేయకూడదు. చాతుర్మాసం తర్వాతే వివాహానికి సంబంధించిన ముమూర్తాలు ప్రారంభమౌతాయి.