పెళ్లి వేదికపై తన్నుకున్న పెళ్లికొడుకు,పెళ్లికూతురు. అసలు ఏమైందంటే..?

వధూవరులు, బంధువులు, స్నేహితులు చేసే సందడి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రేమ, శృంగారం, వర్ణన కోసం కొందరు దృష్టిని ఆకర్షించగా, వేడుకలో జరిగిన విచిత్రమైన సంఘటనలు మరికొందరిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా పెళ్ళికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
పెళ్లి వేడుక జరుగుతుండగా.. వధువు , వరుడు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు ఈ వీడియో.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో చిత్ర విచిత్రాలు చూస్తున్నాం. ఇంచుమించుగా సినిమా సీన్లను తలపిస్తున్నాయి. వేదికపై పెళ్లికొడుకు వెయిట్ చేస్తుంటే బ్యూటీపార్లర్ నుంచి పెళ్లికూతురు ప్రియుడితో పారిపోవడం.
వర్షంలో ఆగని పెళ్లి.. వధూవరుల మెస్మరైజింగ్ డ్యాన్స్.. ఇలా రకరకాల వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. bridal_lehenga_designn అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో పెళ్లికూతురు పెళ్లికొడుకు భయంకరంగా తన్నుకున్నారు. వేదికపై ఇద్దరి మధ్య ఏ విషయం గొడవకు కారణమైందో తెలియదు కానీ ఇరువర్గాల వారు విడదీయడానికి ప్రయత్నించినా వారు తన్నుడు మాత్రం ఆపలేదు.
కారణం ఏదైనా ఈ తన్నులాటతో వారి భవిష్యత్ ఏంటని పెళ్లికి వచ్చిన వారు షాకయ్యారు. ‘పెళ్లిరోజునే విడాకులకు అప్లై చేసేలా ఉంది వీరి పరిస్థితి’ అని .. కొందరు ‘ఫేక్ వీడియో’ అని మరికొందరు కామెంట్లు చేశారు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలవట్లేదు.
అసలు వీరి పెళ్లి ఒక్కరోజు కూడా నిలిచే పరిస్థితి కనిపించడం లేదని అతిథులు వాపోయారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతోంది.