Health

పెళ్లి చేసుకోబోతున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

పెళ్ళి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో, సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.

విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం. అయితే ప్రతీ మనిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో జరిగే పెద్ద వేడుక పెళ్లి. వందేళ్ల జీవితానికి మజిలీగా చెప్పకునే పెళ్లి విషయంలో ప్రతీ ఒక్కరూ ఎన్నో ప్లాన్స్‌ వేసుకుంటారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. తమ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తిపై ఎన్నో అంచనాలు మరెన్నో ఆశలు ఉండడం సర్వసాధారణం.

అందుకే కాబోయే పాట్నర్‌కు సంబంధించి కొన్ని విషయాలైనా పెళ్లికి ముందు తెలుసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడైతే పెళ్లి తర్వాతే కపుల్స్‌ మాట్లాడుకునే వారు కానీ ప్రస్తుతం రోజులు మారాయి. వివాహానికి ముందే ఒకరికొకరు అభిప్రాయాలు, అభిరుచులు పంచుకునే రోజులు వచ్చాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీ వందేళ్ల జీవితానికి వారధిలా ఉపయోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీకు ఎలాంటి విషయాలు నచ్చుతాయి, ఎలాంటివి నచ్చవు వంటి వివరాలను మీకు కాబోయే వారికి తెలియజేయండి.

అలాగే వారికి నచ్చని విషయాల గురించి తెలుసుకోండి. ఏ విషయాలు మీ పాట్నర్‌కు నచ్చవో వాటిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ఉపయోగపడతాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాల్లో అన్నట్లు. ఎంత ప్రేమ ఉన్నా డబ్బు విషయంలో ఎక్కడో ఒక దగ్గర అభిప్రాయాల బేధాలు వస్తుంటాయి. కాబట్టి పెళ్లికి ముందే మీ ఆర్థిక వనరులు, ఖర్చుల గురించి పాట్నర్‌తో పంచుకోండి. భవిష్యత్తులు ఇది గొడవలు రాకుండా కాపాడుతుంది. పిల్లల విషయంలోనూ క్లారిటీ తీసుకోవాల్సిన రోజులివి.

కెరీర్‌ విషయంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానంగా రాణిస్తోన్న ఈ రోజుల్లో పిల్లల విషయం గురించి కూడా పెళ్లికి ముందే ఓ నిర్ణయానికి రావడం ఉత్తమం. వివాహం తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు. జీవితంలో ఎలాంటి ప్రణాళికలు రచించాలనుకుంటున్నారు లాంటి వివరాలపై ఓ క్లారిటీతో ఉండాలి. అదే విషయాన్ని మీ పాట్నర్‌కు కూడా వివరించాలి. కుటుంబం విషయంలో కూడా మీకు కాబోయే పాట్నర్‌ నుంచి పెళ్లికి ముందే స్పష్టత తీసుకోవాలి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో జీవించే వారు తమ భవిష్యత్తు గురించి ముందుగానే పాట్నర్‌తో చర్చించుకోవడం ఉత్తమం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker