ఒకే వేదిక పై అక్కాచెల్లెల్నిపెళ్లి చేసుకున్న వరుడు. అసలు ట్విస్ట్ ఎంతో తెలుసా..?
పెళ్ళి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. అయితే
మహరాష్ట్రలో కల్యాణ వేదికపై పెళ్లి కొడకు ఇద్దరు అమ్మాయిలను ఒకే సమయంలో వివాహం చేసుకున్నాడు. ఈ అరుదైన సంఘటన అక్లూజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వరుడి పేరు అతుల్. పెళ్లి కూతుళ్ల పేర్లు రింకీ, పింకీ. ఇద్దరూ కవల పిల్లలు ఒకే తల్లి కడుపున కలిసి పుట్టిన ఈ ఇద్దరూ అక్కచెల్లెళ్లు చిన్ననాటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు.
ఒకే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఇద్దరూ ముంబైలోని కందివాలిత్లో నివసిస్తున్నారు. ఈ అక్కచెల్లెళ్లు ఇద్దరూ తండ్రి లేకపోవడంతో తల్లితో కలిసి ముంబైలోనే నివసిస్తున్నారు. కవల యువతులు రింకి, పింకీ సాఫ్ట్ ఇంజనీర్లుగా అంధేరిలోని ఓ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నారు. అయితే అనుకోకుండా ఒకరోజు ఇద్దరూ అస్వస్థతకు గురైన సమయంలో అతుల్ ఆసుపత్రిలో చేర్పించాడు. మగ దిక్కులోని ఆ కుటుంబానికి అతుల్ దగ్గరవడంతో కవల యువతుల్లో ఒకరు అతడ్ని ఇష్టపడటంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
అయితే ఇద్దరూ కవల పిల్లలు కావడం..ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోవడంతో ఇద్దరూ కలిసి అతుల్ యాకాషిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అదే విషయాన్ని వరుడు అతుల్‌కి చెప్పారు. ట్విన్స్ తీసుకున్న నిర్ణయాన్ని అతుల్ కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒకే ముహుర్తానికి ఇద్దరు అక్కచెల్లెళ్లకు అతుల్ ఉమ్మడి మొగుడుగా మారాడు. ఈ ఇద్దరు సోదరిమణులు నచ్చిన వాడి మెడలో ఒకేసారి వరమాల వేసి తమ వాడ్ని చేసుకున్నారు. రింకీ, పింకీ ట్విన్స్ చేసుకున్న వెడ్డింగ్ ఇప్పుడు వైరల్ న్యూస్‌గా మారింది.