Health

మీల్‌ మేకర్స్‌ తినేముందు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.

మీల్‌ మేకర్స్‌..శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేందుకు దోహదపడతాయి. సోయాబీన్స్ లో ఆమెనో యాసిడ్స్ పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటును కూడా సులభంగా నియంత్రిస్తాయి. అయితే సోయా చిక్కుడు గింజల నుంచి ఆయిల్‌ను ముందుగా వేరుచేస్తారు. అప్పుడు సోయా పిండి మిగిలిపోతుంది.

సోయా నూనెను తయారుచేస్తున్నప్పుడు ఏర్పడే ఉప పదార్థమే ఈ సోయా పిండి. ఆ పిండిని మీల్ మేకర్‌గా మారుస్తారు. దీనిలో కూడా పోషకాలు అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా కొవ్వు ఉండదు. దీన్ని వెజిటేరియన్ మీట్ అని చెప్పుకోవచ్చు. అందుకే పాశ్చాత్యదేశాల్లో సోయా మీట్ అని కూడా పిలుస్తారు. వీటని వెజ్‌ బిర్యానీలో వేస్తే అచ్చం చికెన్‌ పీస్‌లెక్కే ఉంటుంది.

వీటితో చేసిన వంటకాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.. గుండెజబ్బులు, క్యాన్సర్లు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కాబట్టి మాంసాహారం తినని వారికి ఇది ఉత్తమ ఎంపిక. శక్తి బాగా అందుతుంది. వీటవి తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొవ్వు శాతం పెరుగుతుంది.

అందుకే వీటిని తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. మధుమేహం ఉన్న వారు హ్యాపీగా తినేయొచ్చు. వీటిని తింటే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. మీల్ మేకర్ కర్రీ వండుకోవచ్చు. కూరల్లో కలుపుగా వాడుకోవచ్చు. వంకాయ కూర, బంగాళాదుంప, క్యాబేజీ కూర, కాలీ ఫ్లవర్ కూర వండినప్పుడు వాటిల్లో కలిపేసి వండేయచ్చు. రుచి కూడా బావుంటుంది. వెజ్‌ బిర్యానీల్లోనూ వేసుకోవచ్చు. ఎలా అయితే తినడం కావాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker