అక్కడ్నుంచి రాగానే సమంత, నాగచైతన్య ఒక్కటవుతారా..?
‘నా జీవితం లో మంచి , చెడు అన్ని ఫాస్ట్ గా జరిగిపోయాయి..అలా నాకు వచ్చిన ఈ మాయోసిటిస్ వ్యాధి కూడా తొందరగా తగ్గిపోతుంది, తగ్గినప్పుడు అభిమానులందరికి తెలియచేద్దాం అనుకున్నాను..కానీ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు..చికిత్స తీసుకుంటున్నాను..త్వరలోనే తగ్గిపోతుంది అనుకుంటున్నాను’ అని ఆమె వేసిన ఒక ట్వీట్ అభిమానులను మరియు సెలెబ్రిటీలను కంగారు పడేలా చేసింది.
అయితే సమంత ఆరోగ్య పరిస్థితి విషమించిందని అందుకే ఆమె ఇప్పుడు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను దక్షిణా కొరియా దేశానికి తరలించినట్టుగా చెబుతున్నారు. సమంత ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని.. అందుకే మెరుగైన చికిత్స అందుబాటులో ఉన్న సౌత్ కొరియాకు తరలించినట్టుగా సమాచారం. అమెరికా కన్నా మయోసైటిస్ వ్యాధికి ఒక్క సౌత్ కొరియాలోనే అత్యంత ఆధునిక, సంప్రదాయ వైద్యం అందుబాటులో ఉందని సమాచారం.
సమంత అనారోగానికి డిప్రెషన్ కారణమని తెలుస్తోది. నాగచైతన్యతో విడిపోయాక సమంత బాగానే కృంగిపోయింది. డిప్రెషన్ కు గురైంది. ఈ క్రమంలోనే భారీగా ఎక్సర్ సైజులు చేసి కండరాలపై బాగా ఒత్తిడి పెంచింది. మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురైంది సామ్. ఈ క్రమంలోనే సమంతకు ఈ ‘మయోసైటిస్’ అనే అరుదైన ప్రాణాంతక చికిత్స అందుబాటులో లేని ‘కండరాల క్షీణత’ వ్యాధి సోకినట్టు సమాచారం. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట టాలీవుడ్‌లోనే క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.
అయితే నాలుగు సంవత్సరాలు నాగచైతన్య సమంత ఎంతో అన్యాయంగా ఉండి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ జంటకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ ఇద్దరి మధ్య ఏవో మనస్పర్థలు తలెత్తి విడాకులు తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. విడాకుల తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో చాలామంది ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.అయితే నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చాలా డిప్రెషన్ లోకి వెళ్లింది. అంతేకాకుండా సినిమాల కోసం అతిగా కష్టపడి మయాసైటిస్ అనే వ్యాధి బారిన పడింది.
అయితే సమంత వ్యాధి నయం కాకపోవడంతో దక్షిణ కొరియాకి వెళ్ళింది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. దక్షిణ కొరియా నుండి రాగానే నాగ చైతన్య సమంతను కలవబోతున్నాడట. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఈ విషయంలో నాగచైతన్య ముందుగానే సమంత మేనేజర్ కి చెప్పడంతో ఆయన సమంతకు తెలిపారట. ఇక నాగచైతన్యను కలవడానికి సమంత కూడా ఓకే చెప్పిందట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. ఈ వార్త తెలిసి సమంత, నాగచైతన్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వీరిద్దరు కలిస్తే చూడాలని ఉందంటున్నారు. చాలామంది ఈ జంట మరోసారి కలిసి జీవించాలని ఆశిస్తున్నారు.