Health

మొబైల్ ఎక్కువగా వాడుతున్న వాడుతున్న పురుషులకు నపుంసకత్వం వచ్చే ప్రమాదం.

అసలే కరోనా కాలం కావడంతో ఆన్‌లైన్ పేమెంట్స్ నుంచి ఆన్‌లైన్ క్లాసులు వరకు అన్నీ మొబైల్ ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. అయితే మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల కళ్లు, మెడకు సంబంధించిన సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్, టీవీ లేదా కంప్యూటర్‏లో మనం ఎక్కువ సేపు ఏవైనా వీడియోస్ చూడడం వలన కళ్లపై స్క్రీన్ లైట్ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుందట.

తాజా పరిశోధనల్లో మరో కొత్త విషయం వెల్లడైంది. స్త్రీ, పురుషుల్లో సంతానలేమికి కారణం అవుతుంది. ఇటీవల యుఎస్‌లోని కాలిఫోర్నియా స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్ మొబైల్ ఫోన్‌లను శరీరానికి చాలా అడుగుల దూరంలో ఉంచమని ప్రజలకు సూచించింది. మొబైల్ ఫోన్లు తక్కువ-ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ ద్వారా సమాచారాన్ని ఎక్సేంజ్ చేసుకుంటాయని పేర్కొంది. ఈ ప్రక్రియలో, ఆరోగ్యానికి ప్రమాదకరమైన రేడియేషన్ ఉంది.

రేడియేషన్ పిల్లల ఆరోగ్యంపై మరింత ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. సమాచార ప్రసారానికి మొబైల్ ఫోన్లు ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్ స్థాయిలలో బాగా తగ్గుతుంది అనేది నిజం అయినప్పటికీ, మొబైల్ ఫోన్లు నిరంతరం ఉపయోగించడం, శరీరానికి చాలా దగ్గరగా ఉండటం వలన, ఈ రేడియేషన్ ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటి వరకు చాలా దేశాల్లో జరిపిన అధ్యయనాల ప్రకారం.. ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లను జేబులో పెట్టుకునే పురుషుల్లో స్పెర్మ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది.

దీన్ని నివారించడానికి, మొబైల్‌లో మాట్లాడటానికి స్పీకర్‌ఫోన్ లేదా హెడ్‌సెట్‌ని ఉపయోగించమని సూచిస్తున్నారు. లేదా ఫోన్‌ను మీ చెవులు, తల నుండి దూరంగా ఉంచండి. వీలైనంత వరకు మొబైల్‌లో మాట్లాడే బదులు మెసేజ్ చేయండి. మొబైల్ ఫోన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాంట్ జేబులో లేదా షర్ట్ జేబులో పెట్టవద్దు. దానికి బదులు బ్యాగ్‌లో ఉంచి తీసుకెళ్లండి. మొబైల్ ఫోన్‌ని ఉపయోగించనప్పుడు, దాన్ని ఎయిర్‌ప్లేన్ మోడ్‌లోకి మార్చడమో లేదా స్విచ్ ఆఫ్ చేయడమో చేయాలని సూచిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker