Health

పురుషులు ఇలాంటి ఆహారం తింటే వారికీ పిల్లలు పుట్టడం చాలా కష్టమట..?

మీరు తినే ఆహారంలో మూడింట ఒక వంతు మాత్రమే కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు) ఉండాలి. ఇవి అధికంగా కలిగిన ఆహారపదార్థాలు బంగాళాదుంపలు, రొట్టె, బియ్యం, పాస్తా, తృణధాన్యాలు. పగలు చేసే భోజనంతలో కనీసం పై వాటిలో ఒక పదార్ధం ఉండేలా చూసుకోండి. కొంతమంది పిండి పదార్ధాలు కొవ్వుగా భావిస్తారు, కాని తక్కువ మోతాదులో తీసుకున్న కార్బోహైడ్రేట్ సగం కంటే తక్కువ కేలరీలను అందిస్తుంది. అయితే పట్టించుకోని పురుషులు.. గత 40 ఏళ్లుగా సగటు పురుషుడి స్పెర్మ్ కౌంట్ క్రమంగా తగ్గుతోందని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ వాస్తవం అందరినీ తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. అయినప్పటికీ చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. మనం తినే ఆహారమే వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తుందని తెలిసినా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని నిపుణులు అంటున్నారు. స్పెర్మ్ నాణ్యత తగ్గుతోంది.. స్పెర్మ్ నాణ్యతలో తగ్గుదల అనేది అతిపెద్ద సమస్య. గత 38 ఏళ్లలో సగటు స్పెర్మ్ కౌంట్ 59 శాతం తగ్గిందని తాజా అధ్యయనంలో తేలింది. స్పెర్మ్ కౌంట్ పడిపోవడం వల్ల చాలామంది దంపతులు సంతానం కలుగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కారణం ఏంటి.. స్పెర్మ్ కౌంట్ ఎందుకు అంత త్వరగా తగ్గిపోతుందో ఎవరికీ తెలియదు. ల్యాప్‌టాప్‌లను తమ ఒడిలో పెట్టుకుని పని చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబితే.. ప్యాంటు జేబులో పెట్టుకునే సెల్‌ఫోన్‌ల వల్ల అని మరికొందరు అంటుంటారు. అతిగా మద్యం సేవించడం, ఊబకాయం ఒక కారణమని కూడా కొందరు చెబుతారు. ఆహారం స్పెర్మ్‌ను చంపుతుందా.. స్పెర్మ్ నాణ్యత, కౌంట్‌ తగ్గుదలకి అనేక కారణాలు ఉన్నాయి. అయితే తినే ఆహారం కూడా శుక్ర కణాలపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా..?

ఓ అధ్యయనం ప్రకారం కొన్ని ఆహారాలు తినడం వల్ల స్పెర్మ్‌ కౌంట్ తగ్గుతుంది. అదే సమయంలో స్పెర్మ్ నాణ్యతను పెంచుతాయి. తినకూడని ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..ప్రాసెస్ చేసిన మాంసాలు.. ప్రాసెస్ చేసిన మాంసాహారం తీసుకోవడం వల్ల అన్ని రకాల జబ్బులు వస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాసెస్ చేయబడిన మాంసాలలో మేక, గొడ్డు మాంసం, పంది మాంసం ఉన్నాయి. ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

ట్రాన్స్ ఫ్యాట్స్.. ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు. అలాగే, 2011 స్పానిష్ అధ్యయనం ప్రకారం, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గినట్లు తేలింది. సోయా ఉత్పత్తులు..సోయా ఉత్పత్తులలో ఫైటోఈస్ట్రోజెన్, ఈస్ట్రోజెన్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇరాన్‌లోని బోస్టన్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో సోయా ఉత్పత్తులను అధికంగా తీసుకునేవారిలో స్పెర్మ్ నాణ్యత తగ్గినట్లు తేలింది.

పెస్టిసైడ్స్ అధికంగా వాడిని కూరగాయలు..నేరుగా పెస్టిసైడ్స్ తీసుకోకున్నప్పటికీ.. వాటిని అధికంగా వినియోగించి పండిస్తున్న పంటలను తినడం వలన వాటి ప్రభావం మనుషులపై పడుతోంది. వీటి వలన మనకు అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇది స్పెర్మ్ కౌంటర్ తగ్గిస్తుంది. అధిక కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు..పాలు, క్రీమ్, జున్ను ఇష్టపడే వారైతే.. మీ అలవాట్లను తక్షణమే మార్చుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫుల్ ఫ్యాట్ పాలలో ఈస్ట్రోజెన్ ఉంటుంది. పాల ఉత్పత్తిని పెంచడానికి ఆవులకు ఇచ్చే స్టెరాయిడ్స్ స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తాయి.

ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవడం మానేసి బాదం పాలు, తక్కువ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలని సూచిస్తున్నారు. మద్యం..అబ్బాయిలు, మద్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అతిగా మద్యం సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ వినియోగం సెక్స్ డ్రైవ్‌పై గణనీయమైన ప్రభావం చూపుతుంది. కంటిన్యూగా మద్యం తాగడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి. అందుకే.. కొంచెం జాగ్రత్తగా ఉండి.. మంచి ఆహారాలు తినండి.. ఆరోగ్యంగా ఉండండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker