పురుషులకు మాత్రమే ఎక్కువగా వచ్చే రోగాలు ఇవే.
సాధారణంగా మగవాళ్ల కంటే ఆడవారే మానసికంగా వీక్ గా ఉంటారని అంటుంటారు. కానీ మగవాళ్లే మానసికంగా బలహీనంగా ఎక్కువగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్ సమస్య మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం ఆడవారు తమ సమస్యలను చెప్పుకుంటారు. అయితే 40 ఏండ్లు, ఆ పైబడిన వారు స్థూలకాయం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఇవి చిన్న సమస్యలుగా అనిపించినా.. ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ వయసు వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలని నిపుణులు సలహానిస్తున్నారు. సాధ్యమైనంత వరకు పురుషులు స్మోకింగ్ చేసే అలవాటును మానుకుంటేనే బెటర్. ఎందుకంటే స్మోకింగ్ వల్లే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు పురుషులు ఎక్కువగా ఫేస్ చేసే అనారోగ్య సమస్యలు. వీటన్నింటినీ క్రమం తప్పకుండా తనిఖీ చేయడం అలవాటు చేసుకోవాలి. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం. వీటికి రెగ్యులర్ గా చెకప్ లు చేయించుకుంటే సరిపోతుంది. అయితే గుండెపోటు, స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ లు వంటి రోగాలు ఊహించని విధంగా ప్రాణాలను తీస్తాయి.
అయితే గుండె జబ్బులు, స్ట్రోక్ లు ఆడవారితో పోల్చితే మగవారికే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే పురుషులు థైరాయిడ్ హార్మోన్ ను, విటమిన్ డి, విటమిన్ బి 12 స్థాయిలను సక్రమంగా ఉంచుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఎముక అరుగుదల లేదా బోలు ఎముకల వ్యాధి బారిని పడే అవకాశం ఉంది. ఇది కూడా పురుషులకు ఎక్కువగా వచ్చే అనారోగ్య సమస్య. ఎముక అరుగుదల, క్షీణత వంటి సమస్యలు ఉంటే తరచుగా చెకప్ లు చేయించుకుంటూ ఉండండి. అలాగే మీ జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకోండి. పురుషులకు వచ్చే తీవ్రమైన అనారోగ్యాల విషయానికి వస్తే.. పురుషులు భయపడాల్సినవి రెండు రకాల క్యాన్సర్లు ఉన్నాయి.
ఒకటి ప్రోస్టేట్ క్యాన్సర్, రెండు ఊపిరితిత్తుల క్యాన్సర్. స్మోకింగ్ వల్లే ఈ రెండు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభంలో ఎలాంటి లక్షణాలను చూపించదు. దీనివల్ల ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రంగా మారి ప్రాణాల మీదికి వస్తుంది. అందుకే దీనిని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్యాన్సర్లు వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ముందుగా తెలుసుకోవాలి. అలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మర్చిపోకూడదు.
చాలా మంది పురుషులు మానసిక ఆరోగ్యం గురించి మొత్తానికే పట్టించుకోరు. విసుగు, నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెద్దవారిలో ఎక్కువగా కనిప్తాయి. ఒత్తిడి, ఆందోళన వంటివి మానసిక ఆరోగ్యాన్నే కాదు మొత్తం శరీర ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకే పురుషులు ఒత్తిడిని తగ్గించుకువడానికి ప్రయత్నించాలి. లేదంటే బీపీ, గుండె జబ్బులు, ఉదర సంబంధ వ్యాధులు రావొచ్చు. ఈ సమస్యలన్నీ దీనితో ముడిపడి ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. సకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తింటూ, కంటి నిండా నిద్రపోతూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. స్మోకింగ్ అలవాటును మానేస్తే పురుషుల ఆరోగ్యానికి ఏ డోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.