మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దు. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి.
ఏటా అక్కడ 52,300 మంది ప్రోస్టేట్ క్యాన్సర్‌కు గురవ్వుతుంటే.. 11,900 మంది మరణిస్తున్నారు. అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న యూకేలోనే అన్ని మరణాలు జరుగుతున్నాయంటే.. ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి పూర్తిగా అవగాహన లేని మన దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రొస్టేట్ గ్రంథికి సోకే క్యాన్సర్‌నే ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రొస్టేట్ గ్రంథి వాల్‌నట్ పరిమాణంలో కటి భాగంలోని బ్లాడర్‌కి పక్కనే ఉంటుంది. ఇది వీర్యపు స్రావాలను ఉత్పత్తి చేస్తుంది.
పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు ఎక్కువే అయినప్పటికీ.. ప్రారంభ దశలో బయటపడే కేసులు చాలా తక్కువ. ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశ దాటిందంటే.. అది ఎముకలు, ఇతర అవయవాలకు కూడా విస్తరిస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే మరణం సంభవిస్తుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు.. మూత్ర విసర్జన చేసేటప్పుడు లేదా వీర్య స్కలనం జరిగేటప్పుడు నొప్పిగా లేదా మంటగా అనిపిస్తుంది. రాత్రిపూట మూత్ర విసర్జన ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మూత్రాశయం నిండినా మూత్రాన్ని బయటకు విసర్జించలేకపోతారు. కటి భాగంలో వాపు, ఎముకల్లో నొప్పి, ఫ్రాక్చర్స్, స్వల్ప గాయాలు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
మూత్రం లేదా వీర్యంలో రక్తం రావొచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి.. ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (PSA) బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. డిజిటల్ రెక్టల్ ఎగ్జామ్ (డీఆర్ఈ) ద్వారా కూడా ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నిర్ధారించవచ్చు. ట్రాన్స్‌రెక్టల్ బయోప్సీ కూడా ఇందుకు దోహదపడుతుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ ఎవరికి, ఎలా వస్తుంది.. ప్రొస్టేట్ క్యాన్సర్ ఎలా వస్తుందనే దానికి కచ్చితమైన కారణాలేవీ లేవు.
సాధారణ వ్యక్తులతో పోలిస్తే కుటుంబంలో ప్రొస్టేట్ క్యాన్సర్ హిస్టరీ ఉన్న వ్యక్తులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే వ్యాధిని నియంత్రించవచ్చు. ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్స.. ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయిన వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. క్యాన్సర్ టైప్, స్టేజ్, పేషెంట్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ, సైడ్ ఎఫెక్ట్స్‌ను బట్టి ట్రీట్‌మెంట్ ఆధారపడి ఉంటుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ శరీరంలోని ఇతర అవయవాలు, ఎముకలకు విస్తరించకముందే గుర్తించగలిగినట్లయితే వ్యాధిని నియంత్రించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి ముదిరితే హార్మోన్ థెరపీ, రేడియో థెరపీ, కీమోథెరపీ అవసరమవుతాయి.