Health

పురుషులలో భారీగా తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్, అధ్యయనంలో షాకింగ్ విషయలు.

మహిళలతో పోల్చితే పురుషుల్లో కలుగుతున్న లోపాల వల్లే ఈ సంతాన సమస్యలు ఏర్పడుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ కావాల్సిన సంఖ్య కంటే తక్కువగా ఉండటమే ఇందకు కారణమని చెబుతున్నారు. అయితే మొత్తం మీద గత 46 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా స్పెర్మ్ గణనలు 50 శాతానికి పైగా క్షీణించడాన్ని గమనించినట్లు ఇజ్రాయెల్ కి చెందిన ప్రొఫెసర్ లెవిన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్షీణత ఇటీవల సంవత్సరాలలో వేగవంతమైందని అన్నారు. అయితే ఈ క్షీణతకి గల కారణాలు పరిశీలించనప్పటికి అది సంతానోత్పత్తి అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడతాయని ఆయన చెప్పుకొచ్చారు. తీవ్రమైన ఈ సమస్యని త్వరగా పరిష్కరించపోతే మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన వాతావరణం ప్రోత్సహించడానికి, పునరుత్పత్తికి ముప్పు కలిగించే వాటిని తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే కొనసాగితే మాత్రం భవిష్యత్ లో తీవ్ర అనార్థాలు సంభవించే అవకాశం లేకపోలేదని అన్నారు.

భారత్ లోనూ ఇటువంటి పరిస్థితే ఉందని అందులో ఎటువంటి మార్పులు లేవని తెలిపారు. వీర్య కణాల సంఖ్య తగ్గడం వల్ల వచ్చే సమస్యలు.. స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేయడం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎస్ కి చెందిన మరో ప్రొఫెసర్ హెచ్చరిస్తున్నారు. వృషణ క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత, జననేంద్రియ పుట్టుక లోపాలు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అంతే కాదు దాని ప్రభావం స్త్రీ పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

ఇలా తక్కువ స్పెర్మ్ కౌంట్‌ను కలిగి ఉన్న సమస్యను ‘ఒలిగోస్పెర్మియా’ అంటారు. కౌంట్ తగ్గించే కారణాలు.. ఆల్కహాల్, ప్రాసెస్డ్ మీట్, పాల ఉత్పత్తుల వల్ల వీటి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అతిగా శుద్ది చేసిన మాంసం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. వీర్య కణాలు చురుగ్గా కదలవు. వెన్న తీయని పాలల్లో అధికంగా ఈస్ట్రోజెన్ ఉంటుంది. అలాగే పాల ఉత్పత్తిని పెంచడానికి ఆవులకు స్టెరాయిడ్లు కూడా ఇస్తుంటారు. ఈ రెండింటి వల్ల వీర్య కణాల నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి వెన్న తీసేసిన పాలనే తాగాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker