మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రపోతున్నారా..! ఆ అలవాటు వెంటనే మానుకోండి. లేదంటే..?
మారిపోయిన జీవనశైలి కారణంగా అర్థరాత్రి వరకు మెలకువగా ఉండడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అందుకే మధ్యాహ్నం లంచ్ చేశాక మనకు మగతగా అనిపించి నిద్రపట్టేసి గంటల తరబడి నిద్రపోతాం. ఫలితంగా రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టదు. శరీరానికి సరైన విశ్రాంతి ఉండదు. అయితే మధ్యాహ్నం కాస్త కడుపునిండా భోజనం చేయగానే.. అబ్బ కాసేపు నిద్రపోతే బాగుండు అని చాలా మందికి అనిపిస్తుంది. కొందరికైతే కాసేపు అయినా మధ్యాహ్నం పడుకోనిది ఇక వారు ఉండలేరు.
కచ్చితంగా పడుకోవాల్సిందే. షుగర్.. చెక్కర సంబంధిత ఆహారాలు తీసుకోవడం వల్ల తరచుగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం, జీవక్రియను తగ్గించడం, బరువు పెరగడం ద్వారా మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డైరెక్ట్ గా మనం చెక్కర తీసుకోకపోయినా..మనం తీసుకునే ఆహారంలో ఉండి ఉండొచ్చు. అంటే మధ్యాహ్నం తీసుకునే భోజనంలో జ్యూస్ లు, స్నాక్స్, బిస్కెట్స్, చిప్స్ లాంటివి తీసుకుంటే… మనకు అతిగా నిద్ర వచ్చేలా చేస్తాయట. ఎక్కువ కాఫీ తాగడం.. చాలా మంది ఎక్కువగా కాఫీలు తాగుతూ ఉంటారు. కాఫీ తాగడం వల్ల ఎనర్జీ వచ్చినట్లు ఫీలౌతూ ఉంటారు. అయితే..
ఈ కాఫీ తాగడం వల్ల కూడా నిద్ర వచ్చే అవకాశం ఉంటుందట. అతిగా తినడం వల్ల లంచ్ తర్వాత మీకు మగతగా అనిపించవచ్చు. ఒక రోజులో మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం తగ్గిస్తే నిద్రను ఆపుకోవచ్చు. ఆహారం తీసుకునే సమయం.. మనం తీసుకునే ఆహారం మాత్రమే కాదు… మనం ఏ సమయానికి తీసుకుంటున్నామనేది కూడా ముఖ్యమేనట. సమయానికి తినకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందట. ఉదయం 7-8 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం తినడానికి ప్రయత్నించండి. రాత్రి 7 గంటలకు విందుతో ముగించండి. అప్పుడు మధ్యాహ్నం నిద్ర సమస్య ఉండదు.
అతిగా తినే పిండి పదార్థాలు.. పాస్తా, శాండ్‌విచ్‌లు, రైస్ బౌల్స్, ర్యాప్‌లు వంటి కార్బోహైడ్రేట్‌లు తినడం మనకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ… ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మూలాలను నింపడం ఉత్సాహాన్ని కలిగిస్తుంది కానీ తెలివైన కాల్ కాదు, ముఖ్యంగా భోజనం తర్వాత చాలా నిద్రగా భావించే వారు వీటిని ఎంత ఎవాయిడ్ చేస్తే అంత మంచిది. రక్తంలో చక్కెర స్పైక్‌లను నియంత్రించడానికి పిండి పదార్థాలు ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఫలితంగా, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడం వల్ల మీకు నిద్ర, మగతగా అనిపిస్తుంది. కాబట్టి.. వీటికి బదులు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.