పాలలో కొద్దిగా వీటిని కలుకొని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండటమేకాకుండా, సహజసిద్ధంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని అంటున్నారు. అయితే ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఆధారంగా ఆరోగ్య స్థితి ఉంటుంది. ఆహారపు అలవాట్లు బాగుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. లేకుంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మెరుగైన ఆరోగ్యం కోసం డైట్‌లో పాలు, ఎండుద్రాక్ష చేర్చుకుంటే చాలని..అద్భుత ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు వైద్య నిపుణులు.
ఎండుద్రాక్ష, పాలు. రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. రెండింట్లోనూ పోషక పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. ఎండుద్రాక్షలో హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, కాపర్, ఐరన్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటే..పాలలో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి అత్యధికంగా ఉంటాయి. అందుకే ఈ రెండూ కలిపి ప్రతిరోజూ తాగితే శరీరంలో పోషక పదార్ధాల లేమి తలెత్తదు. ఫలితంగా గంభీరమైన రోగాలు దూరమౌతాయి. ఆరోగ్యం బాగుంటుంది. జ్ఞాపక శక్తి..రోజూ క్రమం తప్పకుండా పాలు, ఎండుద్రాక్ష కలిపి తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల్ని జయించవచ్చు.
ముఖ్యంగా మెమెరీ పెరుగుతుంది. మెదడు పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే బుద్ధి వికసితమౌతుంది. రాత్రి పడుకునేముందు పాలలో ఎండుద్రాక్ష కలిపి తాగడం వల్ల సుఖమైన నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇదొక మంచి ఔషధం కాగలదు. త్వరగా పడుకునేందుకు కూడా దోహదమౌతుంది. ఎముకలు పటిష్టం.. పాలు, ఎండుద్రాక్ష రెండింట్లోనూ కాల్షియం పుష్కలంగా ఉంటున్నందున..ఈ రెండు కలిపి తీసుకోవడం ద్వారా ఎముకలకు బలం చేకూరుతుంది.
ఎండుద్రాక్షలో ఉండే బోరాన్ అనే కెమికల్ ఎముకలకు చాలా లాభదాయకం. అటు కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఫ్రాక్చర్ కారణంగా ఏర్పడే గాయాలు తగ్గుతాయి. ఇతర చాలా గంభీరమైన రోగాలకు పాలు-ఎండుద్రాక్ష మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. ఎండుద్రాక్షలో జీర్ణానికి తోడ్పడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాకుండా మెటబోలిజంను వృద్ధి చేస్తుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. కోలన్ పనితీరు మెరుగుపడుతుంది. శరీరాన్ని ఎప్పటికప్పుడు డీటాక్సిఫై చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము.