Moringa Leave: మునగ ఆకుని ఇలా చేసి తింటే చాలు, డయబెటీస్ తో పాటు ఈ రోగాలుకూడా తగ్గిపోతాయి.

Moringa Leave: మునగ ఆకుని ఇలా చేసి తింటే చాలు, డయబెటీస్ తో పాటు ఈ రోగాలుకూడా తగ్గిపోతాయి.
Moringa Leave: మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. అసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. అయితే మునగ ఆకుల రసంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ప్రొటీన్, విటమిన్ ఎ, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసం తాగితే అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also Read: ఈ ఆకుకూర తింటే చాలు, శరీరంలో హెమోగ్లోబిన్ లెవెల్స్ భారీగా పెరుగుతుంది.
ముఖ్యంగా డయబెటిస్ ఉన్న వాళ్లకు మునగ ఆకు పౌడర్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మధుమేహం వ్యాధిగ్రస్తులకు మునగ ఆకుల రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఐతే చక్కెర వ్యాధిగ్రస్తులు మునగ ఆకుల రసాన్ని సేవించడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. బరువు తగ్గించడంలో మునగ ఆకులు కూడా సహాయపడతాయి. ఈ ఆకుల్లో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. మునగ ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు. మునగ ఆకుల రసం రక్తాన్ని శుభ్రం చేస్తుంది.

శరీరంలోని హానికారక టాక్సిన్లను బయటకు పంపడంలో మునగఆకు రసం నెంబర్‌వన్‌గా పనిచేస్తుంది. కడుపు నొప్పి, కడుపు పూతలకి మునగ ఆకుల రసం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది మునగలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని రసం ఆస్టియోపోరోసిస్ సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుందట. మునగ ఆకుల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి.
Also Read: ఒంటరిగా బతుకుతున్నవారికి వచ్చే ప్రాణాంతక సమస్యలు ఇవే.
ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. మునగ ఆకుల్లోని పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మునగ ఆకు రసాన్ని తాగలేనివారు..ఆ ఆకుతో పప్పు, ఫ్రై లాంటి వంటలు చేసుకుని తినొచ్చు. మునగ ఆకును వేడి నీటిలో వేసి మరిగించి ఫిల్టర్ చేసి టీ లాగా కూడా తాగొచ్చు. ఆరోగ్యానికి మంచిది అని తెలిస్తే అస్సలు వదిలిపెట్టకూడదు..మునగ చెట్టు ఉన్నవారిని ములక్కాయలు ఇమ్మంటే సంకోచిస్తారు కానీ..ఆకులు కావాలంటే ఎవరైనా ఇచ్చేస్తారు. ఇన్ని లాభాలు ఉన్నాయని సైంటిఫిక్‌గా కూడా నిరూపించారు. కాబట్టి వాడేందుకు ప్రయత్నించండి మరీ.!