Morning Body: ఉదయాన్నే ఈ భాగాలలో నొప్పులు వస్తున్నాయా..? మీరు ఏ స్తితిలో ఉన్నారో వెంటనే తెలుసుకోండి.

Morning Body: ఉదయాన్నే ఈ భాగాలలో నొప్పులు వస్తున్నాయా..? మీరు ఏ స్తితిలో ఉన్నారో వెంటనే తెలుసుకోండి.
Morning Body: ఉదయం వచ్చే శరీర నొప్పి చిన్నదిగా అనిపించినా.. అది రోజంతా ప్రభావం చూపుతుంది. చాలా మంది ఉదయం శరీరం నొప్పిగా ఉందని ఫిర్యాదు చేస్తారు. అయితే ఎందుకు నొప్పిగా ఉందో వారికి స్పష్టంగా తెలియదు. ఈ సమస్యను గమనించకపోతే అది మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే నిద్ర సరిగ్గా పట్టాలంటే పరుపు, దిండు నాణ్యత చాలా ముఖ్యం. చాలా కాలంగా వాడుతున్న పరుపు బలహీనంగా మారి శరీరానికి పూర్తి మద్దతు ఇవ్వదు.
Also Read : వండిన ఆహారాలను ఫ్రిజ్‌లో ఎంత సేపు ఉంచాలో తెలుసా..?
అలాగే దిండు చాలా మెత్తగా లేదా గట్టిగా ఉంటే మెడకు సరైన ఆసరా దొరకదు. దీని వల్ల మెడ నొప్పి, భుజాల బిగుతు, వెన్నెముక నొప్పులు ఉదయాన్నే వస్తాయి. ఒకే స్థితిలో ఎక్కువసేపు కదలకుండా ఉండటం వల్ల రక్తప్రసరణ తగ్గి కండరాల శక్తి తగ్గుతుంది. ముఖ్యంగా రాత్రిపూట కదలికలు తక్కువగా ఉంటే ఈ బిగుతు మరింత ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి నిద్రలో అప్పుడప్పుడు పక్కలు మారడం, పగటి సమయంలో వ్యాయామం చేయడం కండరాల్లో నిగ్రహాన్ని పెంచుతుంది.

కీళ్ల నొప్పులు (ఆర్థరైటిస్), ఫైబ్రోమైయాల్జియా లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఉదయాన్నే ఎక్కువగా నొప్పులు అనిపించవచ్చు. ఈ రకాల రుగ్మతలు రాత్రిపూట శరీరం విశ్రాంతిగా ఉండే సమయంలో తమ ప్రభావాన్ని చూపుతాయి. దీనితో పాటు నిద్రలేమి కూడా ఈ పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది. రోజువారీ జీవితంలో తగినన్ని ద్రవాలు తీసుకోకపోతే.. కండరాలు కింది భాగంలో నొప్పిగా మారతాయి. ఇది ఉదయాన్నే శరీర భాగాల్లో పట్టేసినట్టు, బిగుతుగా ఉండేలా చేస్తుంది.
Also Read : ఈ పండు కనపడగానే తినేయండి, ఎందుకంటే..!
ప్రత్యేకంగా రాత్రిపూట మద్యం సేవించడం శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి రోజంతా మంచి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచి పద్ధతి. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలు శరీరంపై ప్రభావం చూపుతాయి. ఒత్తిడి వల్ల శరీర కండరాలు గట్టిగా మారి, ఉదయం నొప్పిగా అనిపించవచ్చు. కాబట్టి ప్రతిరోజూ మానసికంగా ప్రశాంతంగా ఉండేలా ధ్యానం, యోగ వంటి ప్రశాంతమైన వ్యాయామాలను అలవాటు చేసుకోవడం మంచిది.
Also Read : భార్యాభర్తల బంధం బలపడాలంటే..!
మీరు రోజంతా శారీరకంగా కష్టపడినప్పుడు లేదా హఠాత్తుగా ఎక్కువగా వ్యాయామం చేసినప్పుడు కండరాలు అలసిపోయి ఉదయం నొప్పిగా అనిపిస్తాయి. ఈ సమస్యకు పరిష్కారం అంటే వ్యాయామం ముందు తర్వాత సరైన వార్మ్ అప్, కూల్ డౌన్ చేయడం. ఉదయాన్నే నిద్రలేచి శరీరం నొప్పిగా ఉంటే అది చిన్న సమస్య కాదని గుర్తించాలి. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసి శరీరానికి మద్దతు ఇచ్చే నిద్రతీరు, సరైన పోషకాహారం, నీటి మోతాదు, మానసిక ప్రశాంతత వంటి విషయాల్లో శ్రద్ధ పెట్టడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.